సీరమ్ ‘కోవోవాక్స్’ వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి డబ్ల్యూహెచ్ఓ ఆమోదం

న్యూఢిల్లీ: మరో దేశీయ వ్యాక్సిన్ అత్యవసర వినియోగంలోకి వస్తోంది. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) త‌యారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ కోవోవాక్స్‌ అత్యవసర వినియోగానికి శుక్రవారం ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌(డబ్ల్యూహెచ్ఓ) ఆమోదం తెలిపింది. వ్యాక్సిన్ స‌మ‌ర్థ‌త, సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో వ్యాక్సిన్‌ను తీసుకోవ‌చ్చ‌ని స్పష్టం చేసింది.

Recommended Video

    Omicron : Why Did WHO Name This Covid Variant As Omicron? || Oneindia Telugu

    ఈ క్రమంలో ఎస్ఐఐ అధిపతి అదర్ పూనావాలా ప్రపంచ ఆరోగ్య సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. కోవోవాక్స్ టీకాకు ఆమోదం లభించడం మరో మైలురాయి అని వ్యాక్యానించారు. 'కోవిడ్ 19కి వ్యతిరేకంగా మా పోరాటంలో ఇది మరో మైలురాయి, కోవోవాక్స్ ఇప్పుడు డబ్ల్యూహెచ్ఓ ద్వారా అత్యవసర ఉపయోగం కోసం ఆమోదించబడింది, అద్భుతమైన భద్రత, సమర్థతను చూపుతుంది. గొప్ప సహకారం అందించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు' అని పూనావాలా వ్యాఖ్యానించారు.

    SIIs COVID Vaccine Covovax Gets WHOs Approval For Emergency Use

    క‌రోనా ఎన్నిసార్లు మ్యుటేష‌న్ చెందినా.. ఎన్ని కొత్త వేరియంట్లు వ‌చ్చినా.. వాటికి అరికట్టడంలో వ్యాక్సిన్లే ప్ర‌ధాన పాత్ర పోషిస్తాయి. ప్రాణాపాయ స్థితి నుంచి ప్ర‌జ‌ల‌ను కాపాడేది వ్యాక్సిన్లే. అందుకే కోవోవాక్స్‌ను కూడా రివ్యూ చేశాం. దాని క్వాలిటీ, భ‌ద్ర‌త‌, స‌మ‌ర్థ‌త‌.. అన్ని అంశాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్నాక‌.. భార‌త డ్ర‌గ్స్ కంట్రోల‌ర్ జ‌న‌ర‌ల్ నుంచి కూడా గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చాక‌.. మేము ఈ వ్యాక్సిన్‌కు ఆమోదం తెలిపామని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.

    కోవోవాక్స్‌ను నోవావాక్స్ సంస్థ‌తో క‌లిసి సీర‌మ్ సంస్థ అభివృద్ధి చేసింది. కాగా, కోవావాక్స్ కూడా రెండు డోసుల వ్యాక్సిన్. 3 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు కూడా ఈ వ్యాక్సిన్ ఉపయోగించబడుతుందని, 2022 మధ్యలో దీనిని అందుబాటులోకి తీసుకొస్తామని పూనావాలా ఇటీవల చెప్పిన విషయం తెలిసిందే. ప్రారంభించబడుతుందని పూనావాలా ఇటీవల పేర్కొన్నారు. కాగా, ఇప్ప‌టికే సీర‌మ్ సంస్థ ఉత్పత్తి చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్‌‌ను వినియోగిస్తున్న విషయం తెలిసిందే.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+