Sister: తమ్ముడిని చంపిన అక్కాబావ, అంత్యక్రియలకు ఏర్పాట్లు, భార్య ఎంట్రీతో రివర్స్ !

చెన్నై/ కాంచీపురం: వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో కాపురం చేస్తోంది. భార్యకు ఓ తమ్ముడు ఉన్నాడు. పెళ్లి చేసుకుని భర్తతో సంతోషంగా కాపురం చేస్తున్న మహిళ ఇంటికి ఆమె తమ్ముడు వచ్చి వెలుతున్నాడు. మద్యం సేవించడానికి బానిస అయిన తమ్ముడికి అతని అక్క అప్పుడప్పుడు డబ్బులు ఇస్తోంది. ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న తమ్ముడు మద్యం సేవించడానికి బానిస అయ్యి ఉద్యోగం పోగొట్టుకున్నాడు. ఇదే సమయంలో అతనికి ఎక్కువగా అక్క ఆర్థిక సహాయం చేస్తూ వచ్చింది. చాలాకాలం పాటు అక్క మీద ఆధారపడిన అతను ఆమె దగ్గర డబ్బులు తీసుకుని మద్యం సేవిస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. అక్క ఇంటికి వెళ్లిన తమ్ముడు శవం అయ్యాడు. తమ్ముడి అంత్యక్రియులు చెయ్యడినికి అక్క సిద్దం అయ్యింది. తమ్ముడి భార్య రంగంలోకి దిగడంతో అసలు మ్యాటర్ బయటకు వచ్చింది. తమ్ముడిని అతని అక్కాబావ హత్య చేశారని గుర్తించిన పోలీసులు ఆ ఇద్దరిని అరెస్టు చెయ్యడం కలకలం రేపింది.

 అక్క కాపురం

అక్క కాపురం

చెన్నై సిటీకి 25 కిలోమీటర్ల దూరంలోని షోలవరంలో భూపాలన్ (37) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. భూపాలన్ అక్క ధనలక్ష్మి అనే హహిళకు కొన్ని సంవత్సరాల క్రితం రవి (45) అనే వ్యక్తితో వివాహం అయ్యింది. ధనలక్ష్మి ఆమె భర్త రవితో కలిసి సంతోషంగా కాపురం చేస్తూ షోలవరం సమీపంలోనే నివాసం ఉంటున్నది.

 అక్క ఇంటికి ఎక్కువగా వెలుతున్న తమ్ముడు

అక్క ఇంటికి ఎక్కువగా వెలుతున్న తమ్ముడు

పెళ్లి చేసుకుని భర్త రవితో సంతోషంగా కాపురం చేస్తున్న ధనలక్ష్మి ఇంటికి ఆమె తమ్ముడు భూపాలన్ వచ్చి వెలుతున్నాడు. మద్యం సేవించడానికి బానిస అయిన తమ్ముడు భూపాలన్ కు అతని అక్క ధనలక్ష్మి అప్పుడప్పుడు డబ్బులు ఇస్తోంది. బావ రవి దగ్గర కూడా భూపాలన్ ఎక్కువగా డబ్బులు ఇప్పించుకునే వాడని తెలిసింది.

 మద్యం మత్తులో ఎంజాయ్ చేస్తున్నాడు

మద్యం మత్తులో ఎంజాయ్ చేస్తున్నాడు

ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న భూపాలన్ మద్యం సేవించడానికి బానిస అయ్యి ఉద్యోగ పోగొట్టుకున్నాడు. ఇదే సమయంలో భూపలన్ కు ఎక్కువగా అక్క ఆర్థిక సహాయం చేస్తూ వచ్చింది చాలాకాలం పాటు అక్క ధనలక్ష్మి, బావ రవి మీద ఆధారపడిన అతను ఆమె దగ్గర డబ్బులు తీసుకుని మద్యం సేవిస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు.

 అక్క ఇంట్లో హంగామా చేసిన తమ్ముడు

అక్క ఇంట్లో హంగామా చేసిన తమ్ముడు

గత ఏడాది బావ రవి మీద దాడి చేశాడని భూపాలన్ ను అరెస్టు చేసిన పోలీసులు అతన్ని బెయిల్ మీద విడుదల చేశారు. అయినా బావ ఇంటికి భూపాలన్ వెళ్లి వస్తున్నాడు. రాత్రి అక్క ధనలక్ష్మి ఇంటికి వెళ్లిన భూపాలన్ మద్యం సేవించడానికి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు, తన దగ్గర డబ్బులు లేవని ధనలక్ష్మి చెప్పినా భూపాలన్ పట్టించుకోకుండా గొడవ చేశాడు.

 అక్కబావ చేతిలో ఫినిష్

అక్కబావ చేతిలో ఫినిష్

ఆ సందర్బంలో పెద్ద కర్రలు తీసుకుని ధనలక్ష్మి, ఆమె భర్త రవి కలిసి భూపాలన్ మీద దాడి ,చేశారు. తలకు తీవ్రగాయాలైన భూపాలన్ కుప్పకూలిపోయాడు, ఉదయం భూపాలన్ శశమై కనిపించాడు. తమ్ముడు భూపాలన్ ను హత్య చేసిన ధనలక్ష్మి, ఆమె భర్త రవి అతని అంత్యక్రియులు చెయ్యడానికి ప్రయత్నించారు.

 నాటకాలు ఆడిన అక్క

నాటకాలు ఆడిన అక్క

విపరీతంగా మద్యం సేవించిన భూపాలన్ చనిపోయాడని చుట్టుపక్కల వారిని నమ్మించారు, అయితే భూపాలన్ భార్య ఎంట్రీ ఇవ్వడంతో కథ అడ్డం తిరిగింది. ధనలక్ష్మికి ఆమె తమ్ముడు భూపాలన్ కు ఆస్తి పంపకాల విషయంలో గొడవలు ఉన్నాయని, అదే విషయంలో హత్య చేశారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది, ధనలక్ష్మి, ఆమె భర్త రవి హత్య చేశామని అంగీకరించారని పోలీసులు అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+