మరో రైల్లో మంటలు: 9 మంది సజీవ దహనం
థానే: మరో రైలులో అగ్నిప్రమాదం సంభవించింది. బుధవారం తెల్లవారు జామున మహారాష్ట్ర లో థానే దగ్గర డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్ రైలు మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలలో తొమ్మిది మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఓ మహిళ కూడా ఉంది.
మూడు బోగీలు పూర్తిగా దగ్ధం అయ్యాయి. డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్ ముంబై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సిఉంది. ఓ బోగీలో పుట్టిన మంటలు ఇతర రెండు బోగీలకు వ్యాపించాయి. ఈ ప్రమాదం బుధవారం ఉదయం రెండున్నర గంటల ప్రాంతంలో జరిగింది.

ప్రమాదం జరిగిన సమయంలో ప్రయాణికులు గాఢనిద్రలో ఉన్నారు. బోగీకి మంటలు అంటుకున్న విషయాన్ని లెవెల్ క్రాసింగ్ గేట్‌మన్ చూసి గార్డుకు సమాచారం అందించాడు. గార్డు విషయాన్ని డ్రైవర్‌కు అందించాడు. దాంతో రైలును ఆపాడు. గేట్‌మన్ అప్రమత్తత వల్ల పెద్ద ప్రమాదం అగిపోయింది.

రైలుకు చెందిన ఎస్ -3 కోచ్‌కు తొలుత మంటలు అంటుకున్నాయి. దాని నుంచి ఇతర బోగీలకు మంటలు పాకాయి. మృతుల్లో ఒకరిని ఘాట్‌కోపార్‌కు చెదిన దీపికా షా, మరొకరిని బోరివ్లీకి చెందిన దేవ్‌శంకర్ ఉపాధ్యాయగా గుర్తించారు.












Click it and Unblock the Notifications