రాహుల్ గాంధీపై దుమ్మెత్తిపోసిన స్మృతి ఇరానీ
అమేథీ: కాంగ్రెసు ఉపాధ్యక్షుడు, అమేథీ పార్టీ అభ్యర్థి రాహుల్ గాంధీపై బిజెపి అభ్యర్థి స్మృతి ఇరానీ విరుచుకుపడ్డారు. నియోజకవర్గంలో అభివృద్ధి ఏమీ లేదని ఆమె రాహుల్ గాంధీపై మండిపడ్డారు. ప్రగతి సాధిస్తామని హామీ ఇచ్చిన రాహుల్ గాంధీ ప్రజలను మోసం చేశారని ఆమె అన్నారు.
అమేథీలో అభివృద్ధి అనేదే కనిపించడం లేదని, ఈ ప్రాంతం అభివృద్ధికి రాహుల్ గాంధీ చేసింది శూన్యమని ఆమె అన్నారు. సోమవారం ఇక్కడికి వచ్చిన ఆమె రోడ్డు షోలు నిర్వహిస్తూ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

పదేళ్ల పాటు పార్లమెంటు సభ్యుడిగా ఉన్న రాహుల్ గాంధీ యువతకు ఉద్యోగావకశాలు కల్పించలేదని ఆమె విమర్శించారు. ప్రజలు ఇప్పుడు రాహుల్ నిజం స్వరూపాన్ని గుర్తించారని, అభిృద్ధి పేర తమను మోసం చేశారని భావిస్తున్నారని ఆమె అన్నారు.
దేశమంతా మోడీ గాలి వీస్తోందని, ద్రవ్యోల్బణం, అవినీతితో ప్రజలు విసిగిపోయారని, వారు మార్పును కోరుకుంటున్నారని ఆమె అన్నారు. స్మృతి ఇరానీ ప్రవేశంతో అమేథీలో త్రిముఖపోటీ జరగనుంది. ఈ నియోజకవర్గానికి మే 7వ తేదీన పోలింగ్ జరుగుతుంది.












Click it and Unblock the Notifications