ములాయం సింగ్‌కు కొడుకు 'కారు' చిక్కులు, వీడియో వైరల్

ఉత్తర ప్రదేశ్‌లో ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్‌కు చిన్న కొడుకు ప్రతీక్ యాదవ్ చిక్కులు తెచ్చి పెట్టారు.

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్‌కు చిన్న కొడుకు ప్రతీక్ యాదవ్ చిక్కులు తెచ్చి పెట్టారు. ఇప్పటికే సైకిల్ గుర్తు కోసం తండ్రి ములాయం, పెద్ద కొడుకు, ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మధ్య పోరు నడుస్తోంది.

ఈ సమయంలో రెండో కుమారుడు ప్రతీక్‌ యాదవ్‌ తండ్రికి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ఇప్పటి వరకు తెరవెనుక ఉన్న ప్రతీక్‌ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న సమయంలో శుక్రవారం రూ.5 కోట్ల విలువైన లంబోర్గిని కారులో లక్నో రోడ్లపై షికార్లు చేస్తూ మీడియా కంట పడ్డారు. ఇది కాస్తా ఇంటర్నెట్లో వైరల్ అయింది.

ప్రతీక్ యాదవ్ సతీమణి అపర్ణ

ప్రతీక్ యాదవ్ సతీమణి అపర్ణ

ప్రతీక్‌కి చిన్నప్పుడే నుమోనియా సోకింది. దాంతో స్టెరాయిడ్లు వాడటంతో ఏకంగా 103 కిలోలు పెరిగాడు. కొన్నాళ్ల క్రితం అపర్ణ యాదవ్ అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి మూడేళ్ల కూతురు ఉంది. ప్రతీక్‌ మీడియాకి, వివాదాలకి దూరంగా ఉండాలనుకుంటాడు.

ప్రతీక్ యాదవ్

ప్రతీక్ యాదవ్

అయితే 2012నవంబర్‌లో ప్రతీక్‌కు 2014లో జరగబోయే సాధారణ ఎన్నికల్లో ఆజాంఘడ్‌ నుంచి పోటీ చేయడానికి టికెట్‌ ఇవ్వాలని పలువురు ఎస్పీ కార్యకర్తలు లక్నోలోని పార్టీ ఆఫీస్ ఆందోళన చేశారు.

రాజకీయాల్లోకి..

రాజకీయాల్లోకి..

రాజకీయాల్లోకి వెళ్లాలని ప్రతీక్‌ తల్లి సాధన, అతని బాబాయ్‌ శివపాల్‌ యాదవ్‌లు కూడా ప్రోత్సహించారు. కానీ ములాయం మాత్రం ప్రతీక్‌కి టికెట్‌ ఇవ్వలేదు. బదులుగా కోడలు అపర్ణకి టిక్కెట్ ఇచ్చారు. అపర్ణకు మామ ములాయంతో పాటు మోడీ అన్నా అభిమానమే.

ఎన్నికలు

ఎన్నికలు

రాబోతున్న శాసనసభ ఎన్నికల్లో అపర్ణ లక్నో కంటోన్మెంట్‌ నుంచి పోటీ చేయనున్నారు. అపర్ణ భర్త ప్రతీక్‌ మాత్రం ఎక్కువగా తన శారీరక, మానసిక ఫిట్‌నెస్ పైనే దృష్టి సారిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రూ.కోట్ల విలువైన కారులో ప్రతీక్‌ షికార్లు చేయడం పార్టీకి మరో తలనొప్పిలా పరణమించే అవకాశముందంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+