అత్యాచారం: మహిళా మంత్రి సంచలన వ్యాఖ్యలు

లక్నో: మహిళల పైన అత్యాచారాలకు ప్రభుత్వం బాధ్యత వహించదని, సమాజమే ఇలాంటి ఘటనలకు బాధ్యత వహించాలని ఉత్తర ప్రదేశ్ మహిళా మంత్రి అరుణ కోరి అన్నారు. యూపిలోని బదయూ జిల్లాలో ఇటీవల ఓ బాలిక పైన ఇద్దరు పోలీసులు అత్యాచారానికి పాల్పడ్డారు.

ఈ ఘటన పైన రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి అయిన అరుణ కోరి ఆదివారం మాట్లాడారు. ఈ అత్యాచారానికి ప్రభుత్వం బాధ్యత వహించదన్నారు. చిన్నారులను వేధింపులకు గురి చేసే వారి పైన వెంటనే కేసులు నమోదు చేస్తున్నామని చెప్పారు.

Society to be blamed for rape: Aruna Kori

నేరాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షిస్తున్నామన్నారు. అలాగే బదౌన్ అత్యాచారం పైన సమగ్ర నివేదికను కోరినట్లు చెప్పారు. ఏ ప్రభుత్వం ఉన్నా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, అందుకు ప్రభుత్వానిది బద్నాం చేయవద్దని, సమాజమే బాధ్యత వహించాలన్నారు.

మంత్రి వ్యాఖ్యల పైన విపక్షాలు, మహిళా సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం మహిళల పైన జరిగే ఆకృత్యాలకు అడ్డుకట్ట వేయకుండా తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా మాట్లాడుతూ.. మహిళల బాధను అర్థం చేసుకోకుండా మంత్రి మాట్లాడుతున్నారన్నారు.

కాగా, అత్యాచారానికి గురైన బాధితురాలి కుటుంబానికి అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం రూ.5 లక్షల కంపెన్సేషన్ ఇచ్చింది. ఇద్దరు నిందితులను పట్టుకోవాలని స్పెషల్ టాక్స్ ఫోర్స్ పోలీసులను ప్రభుత్వం ఆదేశించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+