టూర్ కు తీసుకు వెళ్లలేదని మహిళ టెక్కి ఆత్మహత్య
బెంగళూరు: విహారయాత్రకు తీసుకు వెళ్లలేదని మహిళ సాప్ట్ వేర్ ఇంజనీరు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బెంగళూరు నగరంలో జరిగింది. కమ్మనహళ్ళిలో నివాసం ఉంటున్న మరసి కిరణ్ షర్బీ (35) అనే మహిళ ఆత్మహత్య చేసుకునిందని పోలీసులు అన్నారు.
ఇన్ఫోసిస్ కంపెనీలో మరసి కిరణ్ షర్బీ సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తోంది. ఈమె భర్త కిరణ్, అత్తతో కలిసి నివాసం ఉంటున్నది. వారం రోజులు సెలవులు ఉన్నందున విహారయాత్రకు వెళ్దామని భర్తకు చెప్పింది.

భర్త కిరణ్ సరే అన్నాడు. అయితే ఆదివారం రాత్రి టూర్ కు వెళ్లడం కుదరదని భర్త, అత్త తేల్చి చెప్పారు. వారిద్దరితో భోజనం చేస్తూనే మరసి గొడవపడింది. అనంతరం బెడ్ రూంలోకి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె ముక్కోపి కావడంతో భర్త ఒక గంట పాటు పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత వెళ్లి తలుపులు పగులగొట్టి చూడగా ఆమె ఆత్మహత్య చేసుకున్న విషయం వెలుగు చూసింది.












Click it and Unblock the Notifications