ఆఫీసు పైనుండి దూకి టెక్కీ మృతి, భవనం కూలి..

 Software Engineer falls to death from sixth floor
తిరువనంతపురం: కేరళలోని టెక్నో పార్క్ క్యాంపస్‌లో గల ఓ ఐటీ సంస్థలో పని చేసే ఓ సాఫ్టువేర్ ఇంజనీర్ ఆరో అంతస్తు నుండి దూకి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. తాను పని చేసే ఆఫీసు భవనం పై నుండి గురువారం ఉదయం అతను దూకి చనిపోయినట్లుగా తెలుస్తోంది.

అతడి మృతి పట్ల తాము తీవ్రంగా ఆవేదన చెందుతున్నట్లు యూఎస్టీ గ్లోబల్ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. దాదాపు మూడేళ్లుగా సదరు సంస్థలో అతను పని చేస్తున్నాడు. మూడేళ్లుగా తమ కంపెనీలో పని చేస్తున్న అతను, చాలా బాగా పని చేసే వాడని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

గురువారం ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో భవానీ బిల్డింగ్ వద్ద ఈ సంఘటన జరిగింది. వెంటనే అతనిని తోటి ఉద్యోగులు, హెచ్ఆర్ సిబ్బంది ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, అక్కడకు వెళ్లేసరికి అతను మరణించినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు విచారిస్తున్నారు. కాగా, మృతుడి వయస్సు 29. అతను కొల్లాం జిల్లాలోని కరుణాగపల్లికి చెందిన వాడని పోలీసులు తెలిపారు

భవనం కూలి విద్యార్థి మృతి

ఢిల్లీ సమీపంలోని నోయిడా ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఒక భవనం గోడ కూలి ఓ విద్యార్థి మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో 15 మంది విద్యార్థులు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. నిర్మాణంలో ఉన్న భవనం పక్కనే పాఠశాల ఉంది. భవన నిర్మాణదారుని పోలీసులు అరెస్టు చేశారు. కేసు పెట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+