భోజనం పెట్టలేదని తల్లిని చంపేశాడు: తండ్రిపై దాడి

Son kills mother for not serving food
సూరత్: గుజరాత్ రాష్ట్రంలోని తాపి జిల్లాలోని బెసనియా గ్రామంలో దారుణం జరిగింది. తనకు భోజనం పెట్టలేదని ఆగ్రహానికి గురైన ఓ వ్యక్తిని తన తండ్రిని తీవ్రంగా కొట్టాడు. అడ్డువచ్చిన తల్లిపైనా కర్రతో దాడి చేసి తీవ్రంగా కొట్టి చంపాడు. ఆ తర్వాత నిందితుడు అక్కడ్నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు, ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

పోలీసుల కథనం ప్రకారం.. ఆదివారం రాత్రి సుక్రిబెన్ భిల్ అనే మహిళ బెసనియా గ్రామంలోని తన ఇంట్లో ఉంది. ఆ సమయంలో ఆమె భర్త బాచూభాయి(60) ఇంటి బయటి ఉన్నాడు. అదే సమయంలో ఇంట్లోకి వచ్చిన వారి కుమారుడు పంకజ్(35) తనకు భోజనం పెట్టాలని అడిగాడు.

అందుకు పంకజ్ తండ్రి బాచుభాయి తిరస్కరించడంతో అతడ్ని పంకజ్ కర్రతో కొట్టడం మొదలుపెట్టాడు. ఇంట్లోని వచ్చిన సుక్రిబెన్ భిల్ తన భర్తను కొడుకు కొడుతుంటే అడ్డుకునే ప్రయత్నం చేసింది. అయితే ఆమెను కూడా కొడుకు పంకజ్ కర్రతో తీవ్రంగా కొట్టి దాడి చేశాడు. దీంతో ఒక్కసారిగా ఆమె కుప్పకూలిపోయింది. తల్లిదండ్రులిద్దర్నీ తీవ్రంగా కొట్టిన పంకజ్ అక్కడ్నుంచి పరారయ్యాడు.

తీవ్ర గాయాలపాలైన పంకజ్ తల్లి సుక్రిబెన్ ఘటనా స్థలంలోనే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వివాహమైనా ఏ పని చేయకపోవడంతో పంకజ్ భార్య కొద్ది నెలల క్రితం పుట్టింటికి వెళ్లిపోయిందని స్థానికులు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+