జన్ ఆక్రోష్ ర్యాలీ: ప్రధానిపై నిప్పులు చెరిగిన సోనియా, మన్మోహన్ సింగ్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో ప్రజలు పూర్తిగా నిరాశలో కూరుకుపోయారని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. ఢిల్లీలోని రామ్ లీలా మైదాన్‌లో నిర్వహించిన జన్ ఆక్రోశ్ సభలో మన్మోహన్ మాట్లాడారు. చమురు ధరలపై ప్రభుత్వం నియంత్రణ కోల్పోయిందన్నారు. ఎన్నికల హామీలను మోడీ నెరవేర్చలేదన్నారు.

ప్రధాని మోడీవి ప్రజావ్యతిరేక విధానాలు అని సోనియా గాంధీ మండిపడ్డారు. నరేంద్ర మోడీ సమాజాన్ని విడగొట్టేలా వ్యవహరిస్తున్నారన్నారు. నేను తినను.. ఇతరులను తిననివ్వనని మోడీ చెప్పారని, కానీ అవినీతి హెచ్చుమీరిందన్నారు. ఎవరైతో ప్రభుత్వాన్ని విమర్శిస్తారో వారి గొంతు నొక్కే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.












Click it and Unblock the Notifications