బాధ్యత ఎవరిది: యోగి ఆధిత్యనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పిల్లలకు రెండు సంవత్సరాలు రాగానే వారి బాధ్యతంతా ప్రభుత్వానిదే అన్నట్టు తల్లిదండ్రులు భావిస్తున్నారన్నారన్నారు.
లక్నో: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పిల్లలకు రెండు సంవత్సరాలు రాగానే వారి బాధ్యతంతా ప్రభుత్వానిదే అన్నట్టు తల్లిదండ్రులు భావిస్తున్నారన్నారన్నారు.
వారి బాధ్యతలను ప్రభుత్వంపై వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ డాక్టర్లు ప్రయివేటుగా ప్రాక్టీస్ చేస్తూ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధులను గాలికి వదిలేస్తున్నారన్నారు.
ఓ మీడియా చానల్ స్టింగ్ ఆపరేషన్ పైనా ఆయన మండిపట్టారు. మీడియా ఒక్కోసారి చెత్త వార్తలను ప్రసారం చేస్తోందన్నారు. బీఆర్డీ ఘటనలపై విచారణకు ఆదేశించామని, నివేదిక వచ్చిన తరువాత చర్యలుంటాయన్నారు.

ఇళ్లలో ఆవులు పెంచితే అవి ఇచ్చే పాలు అమ్ముకోవచ్చునని, కానీ వాటిని ఇప్పుడు రోడ్లపై వదిలేస్తున్నారని, వాటి బాధ్యత కూడా ప్రభుత్వానిదే అన్నట్లు వ్యవహరిస్తున్నారన్నారు. తమ నియోజకవర్గాల్లో గోశాలలు ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యేలు చెబుతున్నారని, అది బాగానే ఉందని, కానీ పాలు మీరు తాగుతారు, గడ్డి, పేడ బాధ్యత ప్రభుత్వానిదా అని ప్రశ్నించారు.
కాగా, నెల రోజుల వ్యవధిలో బాబా రాఘవ్ దాస్ (బీఆర్డీ) మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చాలామంది చిన్నారులు మరణించిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications