Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

UP polls: ప్రతినెలా లీటర్ పెట్రోల్ ఫ్రీ, రైతులు, మహిళలకు వరాలు, అఖిలేష్ ఎస్పీ మేనిఫెస్టో ఇదే

లక్నో: మరికొద్ది రోజుల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభం కానున్న క్రమంలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తమ పార్టీ మేనిఫెస్టోను మంగళవారం విడుదల చేశారు. సమాజ్‌వాదీ 'వచన పత్రం'ను విడుదల చేస్తూ.. సమాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి వస్తే 15 రోజుల్లో రాష్ట్రంలోని చెరుకు రైతులకు పరిహారం అందజేస్తానని అఖిలేష్ హామీ ఇచ్చారు. అటువంటి రైతులకు చెల్లించేందుకు అవసరమైతే కార్పస్ ఫండ్ కూడా సిద్ధం చేస్తామని చెప్పారు.

ప్రతినెలా లీటర్ పెట్రోల్ ఉచితం.. రైతు కుటుంబాలకు 25 లక్షలు

ప్రతినెలా లీటర్ పెట్రోల్ ఉచితం.. రైతు కుటుంబాలకు 25 లక్షలు

రైతు పోరాటాల సందర్భంగా ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల నష్టపరిహారం ఇస్తామని, రాష్ట్రంలో రైతు స్మారక చిహ్నం కూడా నిర్మిస్తామని అఖిలేష్ చెప్పారు. రాష్ట్రంలోని ద్విచక్ర వాహనదారులందరికీ ప్రతి నెలా ఒక లీటర్ ఉచిత పెట్రోల్‌ను అందజేస్తామని అఖిలేష్ ఒక ప్రత్యేక ప్రకటనలో తెలిపారు. యూపీ మాజీ సీఎం అఖిలేష్ విడుదల చేసిన మేనిఫెస్టోను 'సమాజ్‌వాదీ వచన్ పాత్ర' అని ట్యాగ్‌లైన్‌తో పిలుస్తున్నారు-- 'సత్య వచన్, అటూట్ వాద'. వచ్చే నాలుగేళ్లలో (2025 నాటికి) రైతులందరినీ 'రుణరహితం' చేస్తామని, చాలా మంది పేద రైతులకు ప్రయోజనం చేకూర్చే 'క్రిన్ ముక్తి' చట్టం రూపొందిస్తామని చెప్పారు అఖిలేష్ యాదవ్.

ఎంఎస్పీ, ఉపాధి హామీ, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు

ఎంఎస్పీ, ఉపాధి హామీ, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు

రైతులకు అన్ని పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) ఇస్తామని అఖిలేష్ యాదవ్ హామీ ఇచ్చారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే రైతులందరికీ సాగునీటికి ఉచిత విద్యుత్‌, వడ్డీలేని రుణాలు, బీమా, పింఛన్‌ ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. అంతేగాక, ఎస్పీ మ్యానిఫెస్టో MGNREGA తరహాలో పట్టణ ఉపాధి హామీ చట్టాన్ని ప్రవేశపెడుతుందని, పోలీసు శాఖతో సహా ప్రభుత్వ ఉద్యోగాలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చింది.

Recommended Video

    UP Elections 2022: Akhilesh Yadav కోసం Mamata Banerjee | BJP Manifesto | Oneindia Telugu

    ఇంటర్ బాలికలకు రూ. 36వేలు

    12వ తరగతి బోర్డు పరీక్షలో ఉత్తీర్ణులైన బాలికలకు రూ. 36,000 ఒకేసారి చెల్లించే ‘కన్యా విద్యా ధన్' పథకాన్ని ప్రారంభించడంతో పాటు ప్రాథమిక తరగతుల నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు బాలికలకు ఉచిత విద్యను అందించనున్నట్లు ఎస్పీ చీఫ్ తెలిపారు. అదనంగా, సమాజ్ వాదీ పెన్షన్ పథకం కూడా ప్రారంభించబడుతుంది, దీని కింద వృద్ధులు, ముఖ్యంగా పేదరికం కంటే దిగువన ఉన్న (BPL) వర్గంలోని మహిళలు, కుటుంబాలకు ప్రతి సంవత్సరం రూ. 18,000 ఇస్తామని ప్రకటించారు. కాగా, .ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఏడు దశల్లో జరగనున్నాయి. ఫిబ్రవరి 10న తొలి దశ ఎన్నికలు జరగనున్నాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+