టిపై ఆఖరిఘట్టం: ఆత్మత్యాగమన్నఎంపీలపై ప్రత్యేక దృష్టి

న్యూఢిల్లీ: తెలంగాణ ముసాయిదా బిల్లును పార్లమెంటులో పెడితే తాము సభలోనే ఆత్మత్యాగం చేసుకుంటామని సీమాంధ్ర ప్రాంత అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సబ్బం హరి హెచ్చరించిన నేపథ్యంలో వారి పైన ప్రత్యేక దృష్టి సారించాలని భద్రతా సిబ్బందిని ఆదేశించినట్లుగా తెలుస్తోంది.

బిల్లు పెడితే తనతో పాటు మరో ఇద్దరు ఎంపీలం సభలోనే ఆత్మత్యాగం చేసుకుంటామని సబ్బం హెచ్చరించారు. దీనిపై సభాపతి మీరా కుమార్ ప్రత్యేక దృష్టి సారించారని సమాచారం. ఆ ముగ్గురు ఎంపీలపై కన్నేయాలని భద్రతా సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారట.

Sabbam Hari

పయ్యావుల మండిపాటు

ఇప్పుడు రాష్ట్ర విభజన సమస్య అనేది కేవలం మన రాష్ట్ర సమస్యే కాదని, జాతీయ పార్టీల దృష్టినంతటినీ ఆకర్షించిందని తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర సీనియర్ నేత పయ్యావుల కేశ్ ఢిల్లీలో అన్నారు. బిల్లును ప్రజాస్వామ్యబద్దంగా కాకుండా, నిరంకుశత్వంగా ప్రవేశపెట్టాలనుకుంటున్నారని ఆరోపించారు.

పార్లమెంటు సభ్యులను సస్పెండ్ చేయడమంటే ఆ ప్రాంత ప్రజల గొంతును నొక్కేయడమే అన్నారు. పార్లమెంటు ఆవరణలో కూడా ప్రజాస్వామ్యం అపహాస్యమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారిన పరిస్థితుల్లో బిల్లును సభలో ప్రవేశపెట్టాలనుకోవడం మంచిది కాదని సూచించారు. బిల్లును అడ్డుకోవడంతో సీమాంధ్ర ఎంపీలు చేస్తున్న కృషిని అభినందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+