కలకలం రేపిన రోడ్డుపై రూ. 500 నోట్లు: కరోనా వ్యాప్తి కోసమేనా? ఏం జరిగింది?
లక్నో: సాధారణంగా రోడ్డుపై రూ. 500 పడితే ఏం చేస్తారు. అటూ ఇటూ చూసి జేబులో వేసుకుంటారు. లేదంటే ఆ డబ్బు ఎవరిదోనని ఆరా తీసి వారికి చెందేలా చేస్తారు. అయితే ఇప్పుడున్న పరిస్థితి మాత్రం వేరుగా ఉంది. రోడ్డుపై రూ. 500 నోట్లు పడివున్నప్పటికీ ఎవరూ ముట్టుకోకపోవడం గమనార్హం. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

రూ. 500 నోట్లను చూసి భయపడిపోయారు..
వివరాల్లోకి వెళితే.. లక్నోలోని పేపర్ మిల్ కాలనీలోని రహదారిపై గురువారం రాత్రి రెండు రూ. 500 నోట్లు కనిపించాయి. అయితే, అటువైపు వెళ్లేవారు మాత్రం ఆ డబ్బులను ముట్టుకునేందుకు కూడా భయపడిపోయారు. వాటిని చూసి ఆందోళనకు గురయ్యారు.

అటు పోలీసులకు.. ఇటు వైద్యులకు సమాచారం..
అంతేగాక, కరోనావైరస్ వ్యాప్తి చేయడానికే ఎవరో వాటిని ఇక్కడ పడేశారన్న అనుమానంతో ఆ నోట్ల వైపు వెళ్లలేదు. ఇంకేవరినీ కూడా అటువైపు వెళ్లనీయలేదు. అంతటితో ఆగకుండా పోలీసు హెల్ప్ లైన్‌కు ఫోన్ చేసి ఈ నోట్లకు సంబంధించిన సమాచారాన్ని అందించారు. స్థానికంగా ఉన్న డాక్టర్లను కూడా సంప్రదించారు. దీంతో సదరు వైద్యులు 24 గంటలపాటు ఆ నోట్లను ముట్టుకోకూడదని సూచించారు. ఇక స్థానిక ప్రజలు కూడా అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు.

సోషల్ మీడియాలో వీడియోనే కారణం కావొచ్చు...
ఈ విషయంపై మీడియా ప్రతినిధులు స్థానిక ప్రజలను ప్రశ్నించగా.. కరోనావైరస్ వ్యాప్తి చేయడం కోసమే ఎవరో ఆ నోట్లను ఇక్కడ పడేశారని చెప్పుకొచ్చారు. కరెన్సీ నోట్లకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతోనే ప్రజలు ఆందోళన చెందుతున్నారని పోలీసులు చెబుతున్నారు.
Recommended Video

మహారాష్ట్రలో ఓ వ్యక్తి అరెస్టు..
మహారాష్ట్రలో ఓ వ్యక్తి కరెన్సీ నోట్లకు ముక్కులోని శ్లేష్మం అంటిస్తూ ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు. సదరు వ్యక్తి కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఇలాంటి చర్యలు సహించబోమని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications