శ్రీరామ నవమి.. ఐదు శతాబ్దాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత.. భావోద్వేగానికి గురైన ప్రధాని మోదీ
దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీరామనవమి సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అయోధ్య రామ మందిరాన్ని గుర్తుచేసి, అయోధ్య రామాలయ నిర్మాణం తర్వాత జరుగుతున్న తొలి ఉత్సవం అని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
శ్రీరామ నవమి సందర్భంగా ప్రధాని మోదీ ఆకాంక్ష
శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న నా కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు అని పేర్కొన్న ప్రధాని నరేంద్ర మోదీ శ్రీరాముని దయవల్ల ఈ ఏడాది అయోధ్యలో శ్రీరామ మందిరం ప్రారంభోత్సవాన్ని, బాల రాముని ప్రాణ ప్రతిష్టను చూడగలిగాను అని ఆయన వ్యాఖ్యానించారు. ఆదర్శ పురుషుడైన రాముడు జీవితం, ఆయన ఆశయాలు అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణానికి ఆధారాలు అవుతాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు.

భావోద్వేగానికి గురైన ప్రధాని మోదీ
ఇదే సమయంలో తన హృదయం భావోద్వేగం, కృతజ్ఞతతో నిండిపోయింది అని పేర్కొన్న మోదీ అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం, బాల రామయ్య విగ్రహ ప్రతిష్టాపన ఇప్పటికీ నా మదిలో శక్తిని నింపుతున్నాయి అని పేర్కొన్నారు. రాము కృప వల్ల ఈ సంవత్సరం లక్షలాది మందితో కలిసి అయోధ్య రామ మందిరాన్ని ప్రారంభించుకున్నామని మోదీ భావోద్వేగానికి గురయ్యారు.
ఐదు శతాబ్దాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత
అయోధ్య రాముని దివ్య మందిరంలో విగ్రహ ప్రతిష్టాపన జరిగిన తర్వాత జరుగుతున్న తొలి రామనవమి ఇది అని పేర్కొన్న ప్రధాని మోదీ ఐదు శతాబ్దాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అక్కడ ఈ ఉత్సవాన్ని నిర్వహించుకునే భాగ్యం కలిగిందని పేర్కొన్నారు. భారతదేశ ప్రజల ఎన్నో సంవత్సరాల కఠిన తపస్సు, త్యాగాల ఫలితంగా నేడు అయోధ్య రామ మందిరంలో నవమి వేడుకలు జరుపుకుంటున్నామని మోదీ భావోద్వేగానికి గురయ్యారు.
ఆలయ నిర్మాణం కోసం జీవితం అంకితం చేసిన వారిని స్మరించుకోవాలి
శ్రీరాముడు భారతీయ ప్రజల హృదయాలలో ఉన్నాడని ఆలయ నిర్మాణం కోసం తమ జీవితాన్ని అంకితం చేసిన అసంఖ్యాక రామభక్తులు, ఎంతోమంది సాధువులు, రామాలయ నిర్మాణం కోసం పడిన మహానుభావులను ఈ సందర్భంగా గుర్తు స్మరించుకోవాల్సిన ఈ ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
తన్మయత్వానికి లోనైన ప్రధాని మోదీ
రామయ్య ఆశీస్సులు స్వయం సమృద్ధ భారత దేశ సంకల్పానికి కొత్త శక్తిని అందిస్తాయని విశ్వసిస్తున్నానన్నారు. శ్రీరాముని పాదాలకు ప్రణామాలు అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీరామనవమి పర్వదినాన ఆధ్యాత్మిక తన్మయత్వానికి, భావోద్వేగానికి లోనయ్యారు.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications