పండగపూట తీవ్ర విషాదం.. దుర్గాపూజ మండపంలో తొక్కిసలాట.. 17 మందికి పైగా మృతి..
వెస్ట్ బెంగాల్ లోని నార్త్ కోల్ కతాలో తీవ్ర విషాదం నెలకొంది. చోరే భగన్ సర్బోజనిన్ పూజా మండపంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 17 మందికి పైగా మృతి చెందగా మరో 35 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను సమీప ఎంసీహెచ్ ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటన అక్టోబర్ 17న రాత్రి 7 గంటల 40 నిమిషాల సమయంలో జరిగినట్లు కోల్ కతా పోలీసులు వెల్లడించారు. శారదా పార్క్ లోని ఎగ్జిట్ గేట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. భారీ వర్షం కారణంగా భక్తులు ఒక్కసారిగా చోర్ భగన్ దుర్గా పూజా మండపంలోకి వచ్చేందుకు ప్రయత్నించగా తొక్కిసలాట జరిగిందని.. క్షతగాత్రులందరినీ సమీప ఎంసీహెచ్ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు స్పష్టం చేశారు. ఇక ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
భద్రతా కారణాల దృష్ట్యా పూజా పాండల్ ను మూసివేసినట్లు సమాచారం. అలాగే ఘటనాస్థలిలో కంట్రోల్ రూమ్, ఫైర్ బ్రిగేడ్, పోలీసులు, డీఎంజీ టీమ్, అంబులెన్స్ లతోపాటు మెడికల్ బృందాలను భారీగా మోహరించినట్లు స్పష్టం అవుతోంది. ఇక ఘటన జరిగిన వెంటనే వెస్ట్ బెంగాల్ సీఎం సువేందు అధికారి, చీఫ్ సెక్రటరీ మనోజ్ అగర్వాల్ హుటాహుటిన ఆస్పత్రికి చేరుకుని పరిస్థితిపై ఆరా తీశారు.

గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఈ ఘటనపై బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారు వేగంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ కష్టకాలంలో మృతుల అలాగే గాయపడిన వారి కుటుంబాలకు ధైర్యాన్ని ఇవ్వాలని దుర్గామాతను వేడుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.












Click it and Unblock the Notifications
