పెళ్లి పీటలెక్కిన 7 ఆర్ట్స్ సరయు.. జీవితంలో కొత్త ఛాప్టర్ అంటూ ఎమోషనల్
7 ఆర్ట్స్ సరయు.. ఈ జెన్ జీ తరంలో సోషల్ మీడియాతో టచ్‌లో ఉండే వారికి ఈవిడ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన కట్టుబొట్టు, యాస, భాష, డబుల్ మీనింగ్ డైలాగులు, బోల్డ్ బిహేవియర్‌తో యూత్‌లో భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు సరయు. తన మాటలు, చేతలతో నిత్యం వివాదంలో ఉంటారు. తనపై ఎంతగా ట్రోలింగ్ జరిగినప్పటికి తను చెప్పాలనుకున్నది చెప్పడంలో ఏ మాత్రం వెనక్కి తగ్గరు సరయు. ఈ క్రమంలో సరయు తన అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పారు. ఈ బోల్డ్ బ్యూటీ సెలైంట్‌గా పెళ్లి పీటలెక్కింది.
సరయు పూర్తి పేరు సరయు రాయ్. తొలుత తెలుగు బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. నిన్నేపెళ్లాడతా సీరియల్లో నెగిటివ్ రోల్ పోషించింది. ఇదే సమయంలో 7 ఆర్ట్స్ పేరుతో యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసి అందులో అడల్ట్ కామెడీ వీడియోలు చేస్తూ యువతలో ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఈ ఫేమ్తోనే బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5లో కంటెస్టెంట్‌గా అవకాశం దక్కించుకుంది. అయితే మొదటి వారంలోనే ఎలిమినేట్ అయి పరువు పొగొట్టుకుంది. ఆ సమయంలో తనకు పర్ఫార్మెన్స్ చేసే ఛాన్స్ రాలేదని తెగ ఫీలైపోయింది. అయితే ఆ వెంటనే బిగ్‌బాస్ ఓటీటీ నాన్‌స్టాప్‌లోనూ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది.

బిగ్‌బాస్ ఓటీటీ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన యూట్యూబ్ ఛానెల్లో తిరిగి బిజీ అయ్యారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే సరయు ఎప్పటికప్పుడు రీల్స్ పెట్టేవారు. ఇక హాట్ హాట్ డ్రెస్సుల్లో ఫోటో షూట్స్‌తో కుర్రాళ్లను రెచ్చగొట్టేవారు సరయు. అయితే వివాదాల్లనూ సరయు పేరు వినిపించింది. కొన్నేళ్ల క్రితం సిరిసిల్లలో తన మిత్రులతో కలిసి 7 ఆర్ట్స్ రెస్టారెంట్ ప్రారంభించారు సరయు. ఇందుకోసం ఓ షార్ట్ ఫిల్మ్ తీసి విడుదల చేశారు. అయితే ఇందులో ఉన్న కంటెంట్ హిందువులను, మహిళలను కించపరిచేలా ఉందంటూ విశ్వ హిందూ పరిషత్ సీరియస్ అయ్యింది. అంతటితో ఆగకుండా ఏకంగా పోలీసులకు సైతం ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టించింది.
తాజాగా ఈ ముద్దుగుమ్మ పెళ్లి పీటలెక్కేసింది. ఈ మేరకు పెళ్లి బట్టల్లో ఉన్న సరయుని తల్లి ముద్దాడుతున్న ఫోటోను పోస్ట్ చేసింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో సుదీర్ఘ పోస్ట్ పెట్టింది. ఎప్పటికీ అమ్మకు కూతురిగానే.. ఇప్పుడు జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతోంది. ఇది సాక్షాత్తూ పరమేశ్వరుడే నా కోసం రాశాడని నమ్ముతున్నాను. కొన్ని ఆశీర్వాదాలు మాటల్లో చెప్పలేనంత పవిత్రమైనవి, కొన్ని ఆరంభాలకు ఎలాంటి ప్రకటనలూ అవసరం ఉండవు. కేవలం విశ్వాసం, తల్లిప్రేమ, మహాదేవుని అనుగ్రహం అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు సరయు.
ఇదే సమయంలో భర్త ఫేస్‌ను రివీల్ చేయకుండా కేవలం పెళ్లి బట్టల్లో ఓ వ్యక్తి చేయి పట్టుకుని నడుస్తున్న ఫోటోను మాత్రమే సరయు బయటపెట్టారు. దాంతో సరయును పెళ్లి చేసుకున్నది ఎవరు? ఎలా ఉంటారు? అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఇదే సమయంలో సరయుకి అభిమానులు, సన్నిహితులు విషెస్ తెలియజేస్తున్నారు.












Click it and Unblock the Notifications
