రంగంలోకి స్టార్ క్యాంపెయినర్లు - బీజేపీ వర్సెస్ ఎస్పీ హోరాహోరీ : హీటెక్కిన యూపీ..!!
ఇప్పుడు అన్ని ప్రధాన రాజకీయ పార్టీల ఫోకస్ యూపీ వైపే. కీలక నేతలు ప్రచార పర్వంలోకి దిగుతున్నారు. ఎన్నికల కమీషన్ తాజా నిర్ణయంతో ఇప్పుడు స్టార్ క్యాంపెయినర్లు ప్రచార బాట పట్టారు. యూపీ లో ఈ రోజు కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్ బీజేపీ అభ్యర్దుల తరపున షాజహాన్‌పూర్‌లో ప్రచారం చేయనున్నారు. మిరాన్‌పూర్ కత్రాలోని రాంలీలా మైదాన్ దగ్గర జరిగే బహిరంగ సభలో రాజ్‌నాథ్‌సింగ్ ప్రసంగించనున్నారు. ఈ ఎన్నికల్లో బీఎస్పీ అధినేత్రి మాయావతి వ్యూహాలు ఇక విధంగా అంతు చిక్కటం లేదు. బరేలీ జిల్లాలో మాయావతి ప్రచారం చేస్తున్నారు.
Recommended Video

రంగంలోకి బీజేపీ కీలక నేతలు
ఇక, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మీరట్‌లో జరిగే ఎన్నికల బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ సోమవారం ఉదయం 11 గంటలకు బరేలీ విమానాశ్రయానికి చేరుకుని నవాబ్‌గంజ్ బహిరంగ సభలో ప్రసంగిస్తారు, ఆ తర్వాత బిత్రీ చైన్‌పూర్ చేరుకుని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
స్వతంత్ర దేవ్ సింగ్ బులంద్‌షహర్ నుండి బరేలీకి రానున్నారు. బరేలీలో ఇంటింటి ప్రచారంలో పాల్గొని బీజేపీకి ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేయనున్నారు. మాయావతి ఇవాళ బిసల్‌పూర్ రోడ్‌లోని రాధా మాధవ్ స్కూల్ ఎదురుగా ఉన్న మైదానంలో బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.

ఎస్పీ..బీఎస్పీ నేతల ర్యాలీలు
బీఎస్పీ అధినేత్రి ర్యాలీ కోసం ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో 40 మంది కార్యకర్తలకు గేట్‌పాస్‌లు ఇచ్చామని, ర్యాలీకి 1000 మందికి స్థానిక అధికారులు తెలిపారు. సీఎం యోగీ..మీరట్ లో ఆర్‌ఎల్‌డీ చీఫ్ జయంత్ చౌదరి తో కలిసి ప్రచారం చేయనున్నారు. మీరట్‌లోని రెండు అసెంబ్లీ స్థానాల్లో పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారం చేయనున్నారు. అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో యోగి ప్రసంగిస్తారు. దీంతో పాటు సీఎం యోగి బిజ్నోర్ కూడా వెళ్లనున్నారు. ఇప్పటికే ఈ ఎన్నికల్లో గెలిస్తే.. యోగి తిరిగి యోగీ సీఎం అవుతారని ప్రధాని మోదీ స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.

యోగీ మరోసారి సీఎంగా నిర్ణయం
ఇక, తొలి విడత ఎన్నికల కోసం ప్రధాన పార్టీలు ప్రచార హోరు పెంచటం తో ఇప్పుడు... ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తి కరంగా మారుతోంది. పార్టీలు పోటీ పడి హామీలు గుప్పిస్తున్నాయి. అయితే, ప్రధానంగా అధికారంలో ఉన్న బీజేపీ.. ప్రతిపక్ష ఎస్పీ మధ్యనే ప్రధానంగా మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రధాని మోదీ సైతం ప్రధానంగా యూపీలో ప్రచారం పైనే ఫోకస్ పెట్టారు. విజయం పైన బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications