అన్నాడీఎంకే పార్టీ హెడ్ క్వాటర్స్ లో పన్నీర్ సెల్వం: మొదలైయ్యింది అంటూ ట్విట్ !

అన్నాడీఎంకే పార్టీలోని పళనిసామి, పన్నీర్ సెల్వం వర్గాలు చెన్నైలోని రాయపేటలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి మొదట అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్య

చెన్నై: అన్నాడీఎంకే పార్టీలోని పళనిసామి, పన్నీర్ సెల్వం వర్గాలు చెన్నైలోని రాయపేటలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి మొదట అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయంలో అడుగుపెట్టారు.

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఏడు నెలల తరువాత అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయంలో అడుగుపెట్టారు. అన్నాడీఎంకే పార్టీ కార్యాలయంలో అడుగుపెట్టిన పన్నీర్ సెల్వంకు ఆ పార్టీ నాయకులు, కార్యాకర్తలు ఘన స్వాగతం పలికారు.

Started to AIADMK Head Quarters, says Panneerselvam on his twitter page.

జయలలిత చిత్రపటానికి నివాళులు అర్పించిన పన్నీర్ సెల్వం తరువాత తన అధికారిక ట్విట్టర్ లో విలీనం మొదలయ్యింది అంటూ ట్విట్ చేశారు. అన్నాడీఎంకే పార్టీ కార్యాలయంలోకి పన్నీర్ సెల్వం, పళనిసామి రావడంతో పోలీసులు గట్టిబందోబస్తు ఏర్పాటు చేశారు.

అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయంలో పళనిసామి, పన్నీర్ సెల్వం వర్గం నాయకులు చర్చలు జరిపిన తరువాత అందరూ కలిసి మెరీనా బీచ్ లోని జయలలిత సమాధి దగ్గరకు చేరుకుని నివాళులు అర్పించి అధికారికంగా అక్కడే కలిసిపోవాలని నిర్ణయించారు. తరువాత పన్నీర్ సెల్వం. పళనిసామి కలిసి రాజ్ భవన్ చేరుకుని గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావ్ ను కలుసుకుంటారని తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+