వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అడుగేస్తే యుద్ధమే: చైనా హూంకరింపు, బుద్ధి చెప్పేందుకు భారత్ మాస్టర్ ప్లాన్

చీటికి మాటికి కయ్యానికి కాలుదువ్వుతున్న చైనాకు తగిన విధంగా బుద్ధి చెప్పేందుకు భారత్ కూడా రెడీ అవుతోంది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: చైనాతో యుద్ధం వచ్చే అవకాశాలు ఎంతమాత్రమూ లేవని, ఆ దేశం మాటల దేశమే తప్ప చేతల దేశం కాదని భారత రక్షణ శాఖ అధికారి వ్యాఖ్యానించిన వేళ, చైనా తీవ్రంగా స్పందించింది.

తాము సహనానికి చివరి అంచున ఉన్నామని, మరొక్క అడుగు ముందుకేస్తే జరిగేది యుద్ధమేనని హెచ్చరించింది. ఈ మేరకు చైనా అధికార 'గ్లోబల్ టైమ్స్' ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురిస్తూ, యుద్ధం వస్తే ఏం జరుగుతుందన్న సంగతి ఇండియాకు బాగా తెలుసునని వ్యాఖ్యానించింది.

ఉత్తరకొరియాతో ప్రపంచానికే ముప్పు: ట్రంప్, మూన్ జే-ఇన్‌తో మంతనాలు, 'వెయ్యి రెట్టు ప్రతీకారం'!ఉత్తరకొరియాతో ప్రపంచానికే ముప్పు: ట్రంప్, మూన్ జే-ఇన్‌తో మంతనాలు, 'వెయ్యి రెట్టు ప్రతీకారం'!

ఆ సముద్రంలో అపార సంపద.. ఆధిపత్యం కోసం చైనా తహతహ.. అమెరికా, జపాన్ సీరియస్ఆ సముద్రంలో అపార సంపద.. ఆధిపత్యం కోసం చైనా తహతహ.. అమెరికా, జపాన్ సీరియస్

మరోవైపు, చీటికి మాటికి కయ్యానికి కాలుదువ్వుతున్న చైనాకు తగిన విధంగా బుద్ధి చెప్పేందుకు భారత్ కూడా రెడీ అవుతోంది. దేశంలోకి ఇబ్బడి ముబ్బడిగా వచ్చి పడుతున్న చైనా వస్తువులకు చెక్ చెప్పేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.

ఏ క్షణంలో ఏమైనా...

ఏ క్షణంలో ఏమైనా...

ప్రస్తుతం డోక్లామ్ ప్రాంతంలో చైనా, భారత్ భద్రతా దళాల మధ్య కొన్ని వందల మీటర్ల దూరం మాత్రమే ఉన్నట్టు తెలుస్తోంది. భారీ ఎత్తున జవాన్లతో పాటు యుద్ధ ట్యాంకులు, తేలికపాటి క్షిపణి వ్యవస్థలు, అత్యాధునిక రాడార్లు ఇరువైపులా మోహరించి ఉన్నట్లు సమాచారం. డోక్లామ్ వివాదంలో ఏ ఒక్క దేశమూ వెనక్కి తగ్గడం లేదు. దీంతో ఆ ప్రాంతంలో ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న భయాందోళనలు నెలకొని ఉన్నాయి.

Recommended Video

Sikkim standoff: Feasible solution to end standoff between India
ఆదినుంచీ చైనాది అదే ధీమా...

ఆదినుంచీ చైనాది అదే ధీమా...

భారత్ గురించి చైనాకు ఏళ్ల క్రితం ఉన్న అభిప్రాయమే ఇప్పటికీ ఉన్నట్లు అనిపిస్తోంది చైనా చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే. మొదటినుంచీ భారత దేశానిది బలహీనమైన ఆర్థిక వ్యవస్థ అని, యుద్ధమే గనుక సంభవిస్తే భారత్ తమతో ఎక్కువ రోజులు యుద్ధం చేయలేదని చైనా భావన. అలాగే తమ దేశానికి ఉన్నంత ఆయుధ సంపత్తి కూడా భారత్ కు లేదన్న కోణంలోనే చైనా వ్యవహారం సాగిపోతోంది.

1962లో వెనక్కి తగ్గడం వల్లే...

1962లో వెనక్కి తగ్గడం వల్లే...

భారత్ పట్ల చైనాకు ఇంతటి చులకన భావం ఏర్పడటానికి కారణం.. 1962లో భారత్ వెనక్కి తగ్గడమే. అప్పట్లో చైనా జరిపిన ఆకస్మిక దాడికి భారత్ సంసిద్ధంగా లేకపోవడంతో అలా జరిగిపోయింది. అయితే ఒకప్పటి భారత్ వేరు, ఇప్పటి భారత్ వేరు. ఈ విషయమే చైనాకు అర్థం కావడం లేదు. భారత్ విషయంలో చైనా నేటికీ 1962 నాటి భ్రమలోనే ఉండిపోయింది. అందుకే డోక్లామ్ నుంచి భద్రతా దళాలు ఉపసంహరించుకోమంటూ హూంకరిస్తోంది.

చైనాకు బుద్ధి చెప్పాల్సిందే...

చైనాకు బుద్ధి చెప్పాల్సిందే...

చీటికి మాటికి కయ్యానికి కాలుదువ్వుతున్న చైనాకు తగిన విధంగా బుద్ధి చెప్పేందుకు భారత్ రెడీ అవుతోంది. దేశంలోకి ఇబ్బడి ముబ్బడిగా వచ్చి పడుతున్న చైనా వస్తువులకు చెక్ చెప్పేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా భారత్‌లోకి పెద్దమొత్తంలో దిగుమతి అవుతున్న చైనా టైర్లపై డంపింగ్ డ్యూటీ విధించేందుకు రంగం సిద్ధం చేసింది. టన్నుకు ఏకంగా రూ.29 వేల వరకు సుంకం విధించే అవకాశం ఉన్నట్టు సమాచారం. డ్రాగన్ కంట్రీ నుంచి దిగుమతి అవుతున్న చవక ధర టైర్ల కారణంగా దేశీయ కంపెనీలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి వివరిస్తూ డైరెక్టరేట్ ఆఫ్ యాంటీ డంపింగ్ అండ్ డ్యూటీస్ (డీజీఏడీ) ఓ నివేదికను రూపొందిస్తున్నట్టు సమాచారం.

డంపింగ్ డ్యూటీ దెబ్బతో...

డంపింగ్ డ్యూటీ దెబ్బతో...

ఇటీవల చైనాకు చెందిన షాంఘై ఫోసన్ ఫార్మాస్యూటికల్ గ్రూప్‌కు షాకిచ్చిన కేంద్రం తాజాగా టైర్లపై డంపింగ్ డ్యూటీ విధించడం ద్వారా మరో షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. చైనా నుంచి దిగుమతయ్యే టైర్లపై 277.53-452.33 డాలర్ల మధ్య పన్ను విధించాలంటూ ఆర్థిక మంత్రిత్వ శాఖకు డీజీఏడీ ఇప్పటికే ప్రతిపాదనలు పంపింది. మరోవైపు ట్యూబ్‌లెస్ రేడియల్ టైర్ల దిగుమతులపై విచారణ చేపట్టి, పన్ను విధించాలంటూ అపోలో టైర్స్, జేకే టైర్ ఇండస్ట్రీస్, సియట్ కంపెనీల తరపున ఆటోమోటివ్ టైర్‌ మ్యానుఫ్యాక్చర్స్‌ అసోసియేషన్‌ (ఏటీఎంఏ) కోరింది.

మోడీ తీరుతో చైనాలో కలవరం...

మోడీ తీరుతో చైనాలో కలవరం...

నరేంద్ర మోడీ భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి విదేశాంగ విధానంపై తనదైన ముద్ర వేశారు. ప్రపంచమంతా చుట్టి వచ్చి.. ఇతర దేశాల్లో భారత్ పట్ల సానుకుల దృక్పథం ఏర్పడేలా చేశారు. ఎంతో కాలంగా మనల్ని ఇబ్బంది పెడుతున్న చైనాతోనూ ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. వాణిజ్యానికి ఓకే అంటూనే.. దేశ రక్షణకు పెద్ద పీట వేస్తున్నారు. ఇటీవల డోక్లామ్ వివాదం బాగా ముదరడంతో.. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి.

ఇన్నాళ్లకు మనకు అవకాశం దొరికింది...

ఇన్నాళ్లకు మనకు అవకాశం దొరికింది...

ప్రధాని నరేంద్ర మోడీ కొరకరాని కొయ్యగా మారడంతో భారత్ ను అంతర్జాతీయంగా దెబ్బ తీసేందుకు చైనా ప్రయత్నించింది. న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్‌లో సభ్యత్వానికి మోకాలడ్డటం, ఐరాసలో మసూద్ అజహర్‌ను వెనుకేసుకు రావడం.. ఇలాంటి చర్యల ద్వారా శునకానందం పొందింది. ఈ నేపథ్యంలో మోడీ సర్కారు కూడా చైనా పట్ల ఆగ్రహంగా ఉంది. డోక్లామ్ లో రోడ్డు మార్గం రూపంలో చైనాను నిలువరించే అవకాశం ఇప్పుడు మన దేశానికి లభించింది. దీంతో డ్రాగన్‌కు చెక్ పెట్టడం కోసం గతంలో ఏ భారత ప్రధాని కూడా వ్యవహరించనంత దూకుడుగా నరేంద్ర మోడీ చైనా పట్ల వ్యహరిస్తున్నారు.

మోడీకి భారత్ ప్రయోజనాలే ముఖ్యం...

మోడీకి భారత్ ప్రయోజనాలే ముఖ్యం...

‘ఓ నాయకుడిగా మోడీకి భారత ప్రయోజనాలే ముఖ్యం. చైనాకు అవరోధాలు కల్పించడం కోసం ఈ ప్రాంతంలోని ఇతర దేశాలతో కలిసి పని చేసేందుకు ఆయన సుముఖంగా ఉన్నారు' అని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భావిస్తున్నారట. ఈ విషయాన్ని చైనా వ్యవహారాలపై మంచి పట్టున్న అమెరికా నిపుణురాలు బొన్నీ ఎస్ గ్లాసెర్ వెల్లడించారు. ముఖ్యంగా జపాన్, అమెరికాలతో కలిసి పని చేయాలని మోడీ భావిస్తుండటం డ్రాగన్‌కు మింగుడు పడటం లేదని ఆమె తెలిపారు.

అందుకే.. జిన్‌పింగ్ ఢిల్లీ పర్యటన...

అందుకే.. జిన్‌పింగ్ ఢిల్లీ పర్యటన...

‘భారత్‌తో ఉద్రిక్తతలు పెంచుకోవాలని చైనా భావించడం లేదు. అందుకే భారత ప్రధానిగా నరేంద్ర మోడీ పగ్గాలు చేపట్టిన తొలినాళ్లలోనే జిన్‌పింగ్ ఢిల్లీ వెళ్లి ఆయన్ను కలిశారు. చైనా ప్రయోజనాలకు వ్యతిరేకంగా భారత్ నడుచుకోదని ఆయన ఆశించారు. కానీ అది సాధ్యం కాలేదు. దీర్ఘకాలంలో భారత్ తిరుగులేని శక్తిగా అవతరిస్తుందని చైనా బలంగా నమ్ముతోంది. అది తమకు ఇబ్బందులు కలిగిస్తోందేమో అనేది చైనా ఆందోళన. డ్రాగన్ ఆధిపత్యానికి గండి కొట్టడం కోసం అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా లాంటి దేశాలతో భారత్ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతుండటమే ఇప్పుడు చైనాకు మింగుడు పడటం లేదు.' అని గ్లాసెర్ తెలిపారు.

భారత్ తమను అధిగమిస్తుందేమోని...

భారత్ తమను అధిగమిస్తుందేమోని...

సైనిక పరంగా కంటే.. రాజకీయంగానే భారత్‌తో ఎక్కువగా ఇబ్బంది ఉందని చైనా భావిస్తోంది. పెరుగుతున్న ప్రాబ్యలంతో భారత్ డోక్లామ్ లాంటి వివాదాలను తనకు అనుకూలంగా మలుచుకోవాలని అనుకుంటుందేమో అనే సందేహం చైనాను వెంటాడుతోంది. చలికాలం వస్తేనే డోక్లామ్ వివాదానికి ముగింపు లభిస్తుంది. లేదంటే ఈ విషయంలో భూటాన్ అయినా జోక్యం చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే డోక్లామ్ వివాదం సద్దుమణిగే అవకాశం ఉంటుంది.

English summary
Senior Col Li Li of the People's Liberation Army (PLA) may be thousands of kilometres away from Doklam but has a stern message for the Indian Army -- withdraw from the Chinese territory to avoid confrontation. A visit by Indian journalists, sponsored by the Chinese government, today turned into a propaganda exercise by the Chinese Army for delivering its message on the prolonged standoff between troops of the two countries in Doklam near Sikkim. Sr Col Li claimed, "What the Indian troops have done is an invasion of Chinese territory."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X