మాల్యా దేశం విడిచి వెళ్లకుండా చూడండి: బ్యాంకులు
న్యూఢిల్లీ: కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యాకు వరస కష్టాలు మొదలైనాయి. కష్టాలు వెంటాడుతుండటంతో విజయ్ మాల్లా ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. కింగ్ ఫిషర్ అధినేత భారతదేశం విడిచిపెట్టకుండా ఆంక్షలు విధించాలని పలు బ్యాంకులు అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టును ఆశ్రయించాయి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ)తో పాటు 17 జాతీయ బ్యాంకులు మంగళవారం సుప్రీం కోర్టులో పిటీషన్లు వేశాయి. అందులో విజయ్ మాల్యా దేశం విడిచి వెళితే మేము ఇచ్చిన రుణాలు వసూలు చెయ్యడానికి కష్టం అవుతుందని మనవి చేశాయి. ఈ పిటిషన్ ఒకటి రెండు రోజుల్లో విచారణకు వచ్చే అవకాశం ఉందని న్యాయనిపుణులు అంటున్నారు.

సీబీఐ ఫిర్యాదు చెయ్యడంతో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా మీద మనీ ల్యాండరింగ్ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. విజయ్ మాల్యా, ఐడీబీఐ బ్యాంకు అధికారులు కలిసి ప్రభుత్వ బ్యాంకులకు రూ. 900 కోట్ల వరకు నష్టం కలిగించారని సీబీఐ తన ఎఫ్ ఐఆర్ లో పేర్కొంది.












Click it and Unblock the Notifications