వైరల్ వీడియో: గర్భవతిని గెంటేసిన ఆస్పత్రి సిబ్బంది.. వీడియో కాల్ చూస్తూ మెట్రో రైలులోనే..
అక్టోబర్ 14 మంగళవారం అర్ధరాత్రి 1 గంట సమయంలో ముంబైలోని ఓ మహిళ లోకల్ ట్రైన్ లో ప్రయాణిస్తుండగా పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో ఆ గర్భిణి చాలా ఇబ్బంది పడింది. ఇది గమనించిన తోటి ప్రయాణికులు ఆర్పీఎఫ్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే అలర్ట్ అయిన ఆర్పీఎఫ్ సిబ్బంది రామ్ మందిర్ రైల్వే స్టేషన్ లో రైలుని నిలిపివేశారు. గర్భిణిని రైలు నుంచి బయటకు తీసుకొచ్చారు. అలా రైల్వే ప్లాట్ ఫామ్ పైనే ఆమె ప్రసవించింది. దీంతో అక్కడి ప్రయాణికులు, రైల్వే సిబ్బంది ఊపిరి పీల్చుకుంది. కానీ ఆ బిడ్డ ప్రస్తుతం చావు బతుకుల మధ్య కొట్టు మిట్టాడుతోంది. ఆ పసికందు ఇప్పుడు నియో నాటల్ ఇంటెన్సీవ్ కేర్ యూనిట్(NICU) తో ప్రాణాపాయ స్థితిలో ఉంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ముంబైలో షాకింగ్ ఘటన జరిగింది. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన మన్ జీత్ దిల్లోన్ అనే వ్యక్తి తన ఇన్ స్టా గ్రామ్ లో ఇందుకు సంబంధించిన స్టోరీని పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. గర్భంతో ఉన్న ఓ మహిళను ఆమె కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే ఆమెను చేర్చుకునేందుకు వైద్యులు నిరాకరించారు. ఆస్పత్రి నుంచి వెళ్లిపొమ్మన్నారు. దీంతో అర్ధరాత్రి 1 గంట సమయంలో ఆ గర్భిణి తమ కుటుంబంతో కలిసి లోకల్ ట్రైన్ లో ప్రయాణిస్తుండగా ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయి.
ఆ సమయంలోనే రైలులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి ధైర్యసాహసాల వల్ల తల్లీ బిడ్డ ప్రాణాల నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం ఈ వార్త ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతుంది. ఓ మహిళా వైద్యురాలి వీడియో కాల్ చూస్తూ ఆ వ్యక్తి గర్భిణికి ప్రసవం చేశాడు. అర్ధ రాత్రి కావడంతో ఆ సమయంలో ఏ సేవలు అందుబాటులో లేవు." మేము చాలా మంది వైద్యులకు కాల్ చేశాం. అంబులెన్స్ పంపించమని అడిగాం.. కానీ అన్నీ లేట్ అవుతున్నాయి. చివరికి ఓ మహిళా వైద్యురాలు వీడియో కాల్ చేసి ఏం చేయాలో చెప్పారు. స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యాడు. ఆ వ్యక్తి వైద్యం వల్ల ఆమె ప్రసవించింది. రైల్వే ప్లాట్ ఫామ్ పైనే బిడ్డకు జన్మనిచ్చింది" అని దిల్లోన్ తన ఇన్ స్టాలో రాసుకొచ్చాడు.
అయితే వెంటనే ఆ మహిళను, అప్పుడే పుట్టిన బిడ్డను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ వైద్యులు పరీక్షలు జరిపి ఆ పసిబిడ్డ గుండెలో హోల్ ఉందని తెలిపారు. బిడ్డ ముఖంలోనూ పలు మార్పులు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం ఆ బిడ్డ యో నాటల్ ఇంటెన్సీవ్ కేర్ యూనిట్(NICU) తో ప్రాణాపాయ స్థితిలో ఉంది. ఇక ఆ మహిళ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో మహిళకు సకాలంలో వైద్యం చేసిన ఆ వ్యక్తిని నెట్టింట ప్రశంసిస్తున్నారు. రియల్ హీరో అంటూ ఆకాశానికి ఎత్తుతున్నారు.

ఇదే క్రమంలో గర్భిణిని మొదట చేర్చుకోని ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు నెటిజెన్లు. ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రికి వచ్చిన గర్భిణిని తిరిగి ఎలా పంపిస్తారని మండిపడుతున్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఆ ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
-
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు











Click it and Unblock the Notifications