Student: స్కూల్ లో అందరిముందు హెడ్ మాస్టర్ పుర్రె పగలగొట్టిన ఇంటర్ విద్యార్థి !
చెన్నై/ విల్లపురం: తమిళనాడులోని విల్లుపురం జిల్లాలోన కందమంగలంలో హయ్యర్ సెకండరీ గ్రేడ్ స్కూల్ అండూ కాలేజ్ ఉంది కందమంగళం మండలం పరిసర ప్రాంతాల్లోని గ్రామాల్లో నివాసం ఉంటున్న అమ్మాయిలు, అబ్బాయిలు ఆరవ తరగతి నుంచి ఇంటర్ వరకు ఇక్కడ చదువుకుంటున్నారు. ఈస్కూల్ లో హెడ్ మాస్టర్ ను చూస్తే విద్యార్థులు హడలిపోతారు.
స్కూల్ అండ్ కాలేజ్ లో జీవియర్ చంద్రకుమార్ హెడ్ మాస్టర్ గా ఉద్యోగం చేస్తున్నారు. చంద్రకుమార్ విద్యార్థుల పట్ల కొంచెం కఠినంగా ఉంటున్నాడని, అందరూ బాగా చదువుకోవాలని ఆయన ఆశపడుతున్నారని తెలిసింది. ఇదే కాలేజ్ లో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న విఘ్నేష్ అనే యువకుడు జూనియర్లను ర్యాంగింగ్ చేస్తున్నాడు.

ఈ విషయం తెలుసుకున్న హెడ్ మాస్టర్ చంద్రకుమార్ ఇంటర్ విద్యార్థి విఘ్నేష్ ను పిలిపించి మందలించారు. బుద్దిగా చదువుకోకపోతే టీసీ ఇచ్చి పంపిస్తానని అతనికి వార్నింగ్ ఇచ్చాడు. హెడ్ మాస్టర్ వార్నింగ్ ఇచ్చినా విఘ్నేష్ మాత్రం జూనియర్లను ర్యాంగింగ్ చేస్తూనే ఉన్నాడు. హెడ్ మాస్టర్ చంద్రకుమార్ విద్యార్థులు అందరి ముందు ఇంటర్ విద్యార్థి విఘ్నేష్ కు గట్టిగా వార్నింగ్ ఇచ్చి స్కూల్ బయటకు వెళ్లిపోవాలని చెప్పాడు.
సహనం కోల్పోయిన విఘ్నేష్ అతని బ్యాగ్ లోని పెద్ద కర్ర తీసుకుని హెడ్ మాస్టర్ చంద్రకుమార్ పుర్రేమీద దాడి చెయ్యడంతో ఆయనకు తీవ్రగాయాలైనాయి. విషయం తెలుసుకున్న విల్లుపురం విద్యాశాఖ అధికారి క్రిష్ణప్రియా సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి ఇంటర్ విద్యార్థి విఘ్నేష్ ను సస్పెండ్ చేశారు. హెడ్ మాస్టర్ చంద్రకుమార్ పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో ఇంటర్ విద్యార్థి విఘ్నేష్ ను అరెస్టు చేశారు. విద్యార్థులు అందరి ముందు హెడ్ మాస్టర్ పెర్ర పగలగొట్టడం తమిళనాడులో కలకలం రేపింది.












Click it and Unblock the Notifications