క్లాస్‌రుంలోనే విద్యార్థిని పొడిచి చంపాడు: పాత మిత్రుడి పనే

Student stabbed to death in Tamil Nadu school
చెన్నై: తోటి విద్యార్థులంతా చూస్తుండగా ఓ విద్యార్థి ఎనిమిదో తరగతి విద్యార్థిని కత్తితో పొడిచి చంపాడు. మిత్రుడిగా ఉంటూ విడిపోయిన విద్యార్థి తోటి విద్యార్థిని దారుణంగా హత్య చేశాడు. శుక్రవారంనాడు తమిళనాడులోని విరుద్ధునగర్ జిల్లా ప్రభుత్వ పాఠశాలలో ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటనతో విద్యార్థులు, ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

13 ఏల్ల జి. భాస్కర్ అనే విద్యార్థిని పదునైన ఆయుధంతో నుదుటిపై మూడు సార్లు పొడిచాడు. అరుపుకొట్టాయ్ సమీపంలోని పండలుడిలో తోటి విద్యార్థులు చూస్తుండగా నిందితుడు ఆ పనిచేశాడు. గాయపడిన విద్యార్థి ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు.

వ్యక్తిగత శత్రుత్వం కారణంగానే అతను ఈ దారుణానికి ఒడి గట్టి ఉంటాడని అనుమానిస్తున్నారు. తరగతులు ప్రారంభం కావడానికి ముందు శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. దాడి చేసిన విద్యార్థిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

పాఠశాల మాజీ విద్యార్థిని ఈ ఘటనలో నిందితుడిగా గుర్తించారు. అతను మైనర్ కూడా అని తెలుస్తోంది. దాడి చేసిన అనంతరం అతను పారిపోయాడు. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ స్థానికులు ట్రాఫిక్‌ను అడ్డుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+