''రజనీ రాజకీయాలకు దూరంగా ఉంటేనే మంచిది'', కానీ, '' 21 ఏళ్ళ క్రితమే తప్పు చేశా ''

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై:దేవుడు శాసిస్తే నేను రాజకీయాల్లోకి రావొచ్చు అని సూపర్ స్టార్ రజనీకాంత్ చెప్పడాన్ని ఓ పొలిటికల్ జోక్ గా అభివర్ణించారు బిజెపి సీనియర్ నాయకుడు సుబ్రమణ్యం.ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటేనే మంచిదని చెప్పారు సుబ్రమణ్యం.

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులతో సోమవారం నాడు సమావేశమయ్యారు.ఈ రోజు నుండి నాలుగురోజులపాటు రజనీకాంత్ తన అభిమానులతో సమావేశం కానున్నారు.అయితే రాజకీయాల్లో చేరే విషయమై తన పేరును దుర్వినియోగం చేస్తున్నారనే ఆవేదనను ఆయన వ్యక్తం చేస్తున్నారు.

అయితే తమిళనాడులో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని ఆయన అభిమానులు కోరుకొంటున్నారు.అదే సమయంలో కొన్ని రాజకీయపార్టీలు రజనీకాంత్ ను తమ వైపుకు తిప్పుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.

అయితే అభిమానులతో సమావేశం నేపథ్యంలో రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం కూడ సాగుతోంది.అయితే ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సిన అవసరం ఉంది.అదే సమయంలో రజనీని రాజకీయాల్లోకి రాకూడదని సుబ్రమణ్యస్వామి లాంటి నాయకులు సూచిస్తున్నారు.

రజనీ రాజకీయాలకు రాకూడదు

రజనీ రాజకీయాలకు రాకూడదు

రాజకీయాలకు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ దూరంగా ఉంటేనే మంచిదని బిజెపి సీనియర్ నాయకుడు సుబ్రమణ్యస్వామి అభిప్రాయపడ్డారు. దేవుడు శాసిస్తే, నేను రాజకీయాల్లోకి వస్తానని రజనీకాంత్ ప్రకటించడం ఓ పొలిటికల్ జోక్ గా సుబ్రమణ్యస్వామి అభిప్రాయపడ్డారు.రజనీకాంత్ అసలు ఓ సిద్దాంతమే లేదన్నారు. ఆయన గతంలో వేర్వేరు పార్టీలతో కలిశారని చెప్పారు.అయితే ఆ సిద్దాంతాలను పాటించలేదని ఆయన చెప్పారు.ఆయన తరచూ తన నిర్ణయాలను మార్చుకొంటారని సుబ్రమణ్యస్వామి చెప్పారు.

21 ఏళ్ళ క్రితం తప్పు చేశాను

21 ఏళ్ళ క్రితం తప్పు చేశాను

21 ఏళ్ళ క్రితం తాను ఓ రాజకీయ కూటమికి మద్దతిచ్చి తప్పుచేశానని రజనీకాంత్ చెప్పారు. అయితే ఈ విషయాన్ని ఆయన ఓ పొలిటికల్ యాక్సిడెంట్ అని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక నిర్ణయం తీసుకొన్నప్పుడు దానిపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే మార్చుకోవాల్సి ఉంటుందన్నారు. శ్రీలంక పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకొన్న విషయమై చెప్పారు.

రజనీ వ్యాఖ్యలను స్వాగతించిన గురుమూర్తి

రజనీ వ్యాఖ్యలను స్వాగతించిన గురుమూర్తి

రాజకీయాల్లో చేరొచ్చనే రజనీకాంత్ ప్రకటన పట్ల ఆర్ ఎస్ ఎస్ సిద్దాంతకర్త ఎస్. గురుమూర్తి స్వాగతించారు. రజనీకాంత్ అచ్చం మోడీలాగానే వ్యవహరిస్తారని ఆయన చెప్పారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, పార్టీ సీనియర్ నాయకుడు నితిన్ గడ్కరీలు కూడ రజనీకాంత్ తో టచ్ లో ఉన్నారని సమాచారం.అయితే బిజెపి జాతీయ నాయకత్వానికి చెందిన కొందరు సీనియర్ నాయకులు మాత్రం రజనీకాంత్ పట్ల సానుకూలంగా స్పందిస్తోంటే, సుబ్రమణ్యస్వామి మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

రజనీకాంత్ తమిళుడే కాదని, ఆయన బెంగుళూరు నుండి వచ్చిన మరాఠీ వ్యక్తి అని సుబ్రమణ్యస్వామి చెప్పారు.రజనీకాంత్ అభిమానులు సిద్దాంతాలకు ఆకర్షితులై వచ్చినవారు కాదన్నారు. ప్రకటనలు చేయడంలో సినిమా వాళ్ళు దిట్ట.వాళ్ళకు ఎవరో డైలాగులు రాసిస్తారని ఆయన మండిపడ్డారు.

రాజకీయాల్లోకి వచ్చేందుకు ఇదే సరైన సమయం

రాజకీయాల్లోకి వచ్చేందుకు ఇదే సరైన సమయం

తమిళనాడు రాజకీయాల్లోకి సినీ నటుడు రజనీకాంత్ రావడానికి ఇదే సమయమనే అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తమిళనాడు రాష్ట్రంలో జయలలిత మరణం తర్వాత సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి.ఈ పరిస్థితుల నేపథ్యంలో రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే ప్రయోజనంగా ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అన్నాడిఎంకెలో నాయకత్వ సమస్య రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే కలసివస్తోందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Bjp senior leader subramanian swamy suggested to Tamil superstar Rajinikanth not enter into politics.He didn't have own ideology he said.
Please Wait while comments are loading...