ఎన్నికలలో పోటి, కైమా చేస్తామని వార్నింగ్
బెంగళూరు: బృహత్ బెంగళూరు మహా నగర పాలికె (బీబీఎంపీ) ఎన్నికలలో పోటీ చేస్తున్న వ్యక్తిని చంపేస్తామని బెదిరిస్తు ఫోన్ లు చేశారు. ప్రధాన పార్టీ అభ్యర్థిగా ఉన్న ఆయన కారును ధ్వంసం చేసిన సంఘటన బెంగళూరులో జరిగింది.
మటన్ షాప్ లో కైమా కొట్టినట్లు ముక్కలు ముక్కలు చేస్తామని బెదిరించారని సుబ్రమణ్య నగర వార్డు (నెంబర్ 66) జేడీఎస్ పార్టీ అభ్యర్థి నాగరాజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బెదిరింపు ఫోన్ లు వచ్చిన మరుసటి రోజు ఆయన ఇంటి ముందు నిలిపి ఉన్న కారు ధ్వంసం చేశారు.
మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రోత్సాహంతో నాగరాజ్ జేడీఎస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇతనికి గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేశారు. నువ్వు గుడిలో పూజ చేసుకోకుండ ఎన్నికలలో ఎందుకు నిలబడ్డావు, రాజకీయాలు అంటే ఏమనుకున్నావు అని బెదిరించారు.

మర్యాదగా ఎన్నికల బరిలో నుండి తప్పుకోకుంటే నీ అంతు చూస్తామని, మటన్ షాప్ లో కైమా కొట్టినట్లు కొట్టి నిన్ను అంతం చేస్తామని బెదిరించారు. దేవాలయంలో పూజలు చెయ్యడం వదిలి పెట్టి రాజకీయాలలోకి ఎందుకు వచ్చావు అని బెదిరించారని నాగరాజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మూడు రోజులలో నీకు అసలు రాజకీయం చూపిస్తామని, అప్పుడు మా సత్తా ఎంటో తెలుస్తుందని హెచ్చరించారని నాగరాజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాగరాజ్ కు వచ్చిన ఫోన్ నెంబర్ ఆదారంగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ నెల 22వ తేదిన బీబీఎంపీ ఎన్నికలు జరగనున్నాయి.












Click it and Unblock the Notifications