లోకసభ స్పీకర్‌గా సుమిత్రా మహాజన్: మోడీ అభినందన
న్యూఢిల్లీ: 16వ లోకసభ స్పీకర్‌గా భారతీయ జనతా పార్టీ ఎంపి సుమిత్రా మహాజన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం ఉదయం ప్రారంభమైన లోకసభ సమావేశాల్లో ఆమె ఎన్నికను సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. సుమిత్రా మహాజన్ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నుంచి 8వసారి ఎంపిగా ఎన్నికయ్యారు. మీరా కుమార్ తర్వాత రెండో మహిళా లోకసభ స్పీకర్‌గా సుమిత్రా మహాజన్ ఎన్నికయ్యారు.
మాజీ ప్రధాని అటల్ బీహారి వాజపాయి ప్రభుత్వ హయాంలో సహాయ మంత్రిగా సుమిత్రా మహాజన్ పని చేశారు. లోకసభ స్పీకర్‌గా ఎన్నికైన సుమిత్రా మహాజన్‌కు ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపి అగ్రనేత ఎల్‌కె అద్వానీ, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, కాంగ్రెస్ పక్ష నేత మల్లిఖార్జున ఖర్గే, ఇతర పార్టీల సభ్యులు అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. సుమిత్రా మహాజన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అతిపెద్ద ప్రజాస్వామిక దేవాలయంలో స్పీకర్‌గా ఓ మహిళ ఎంపిక కావడం గర్వకారణమని అన్నారు. సభ్యులందరికీ తమ అనుభవంతో మార్గనిర్దేశనం చేయాలని కోరారు. లోకసభకు 310 మంది సభ్యులు కొత్తగా ఎన్నికయ్యారని చెప్పారు.
లోకసభ ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించిన కమల్‌నాథ్‌కు వెంకయ్య నాయుడు ధన్యవాదాలు తెలిపారు. 510 మంది సభ్యులచే ఒక్క రోజులోనే ప్రమాణం స్వీకారం చేయించారని అన్నారు.












Click it and Unblock the Notifications