మిస్టరీ: సునంద పుష్కర్ ఎవరితోనైనా గొడవ పడ్డారా?

న్యూఢిల్లీ: కేంద్రమంత్రి శశిథరూర్ సతీమణి సునంద పుష్కర్ తన ఆత్మహత్యకు ముందు ఎవరితోనైనా ఘర్షణకు దిగారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సునందది అసహజ మరణమని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(ఎయిమ్స్) వైద్యులు తేల్చారు. సునంద మృతి ఓ మిస్టరీగా మారినట్లుగా కనిపిస్తోంది.

సునంద మృతిని హత్య, ఆత్మహత్య కోణంలో దర్యాఫ్తు చేయాలని పోలీసులు ఆదేశించిన విషయం తెలిసిందే. సునంద మృతదేహం పైన డజనుకు పైగా గాయాలు ఉన్నట్లుగా వైద్యులు గుర్తించారు. ఆ గాయాలను బట్టి సునంద మృతికి ముందు ఎవరితోనైనా గొడవపడి ఉండవచ్చుని అనుమానిస్తున్నారట.

Sunanda Pushkar

సునంద రెండు చేతుల పైన డజనుకు పైగా గాయాల గుర్తులు ఉన్నట్లు, ఎడమ చెంపపై కమిలిన ఆనవాళ్లు ఉన్నట్లు కూడా శవ పరీక్షలో తేలింది. మరోవైపు ఈ గాయాల వల్ల మరణం సంభవించలేదని వైద్యుల నివేదిక చెబుతోంది. హింసాత్మక దాడి కారణంగా సునంద మరణించినట్లుగా ఆమె కుటుంబ సభ్యులెవరు కూడా అనుమానం వ్యక్తం చేయడం లేదు.

సునంద మరణం హత్య, ఆత్మహత్య, ప్రమాదం.. ఈ మూడింటిలో ఏదో ఒకవిధంగా సంభవించి ఉండొచ్చని, కచ్చితమైన కారణమేదో నిర్ధారించడానికి పోలీసులు దర్యాఫ్తు కొనసాగించాలని సూచించారు కూడా. పాయిజనింగుకు కారణమేమిటి, ఏ ఔషధం వల్ల అది జరిగిందనేది విసేరా నివేదిక వచ్చిన తర్వాత తేలుతుందంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+