అసమగ్రంగా నివేదిక: సునంద పుష్కర్ మృతిలో ట్విస్ట్
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి శశిథరూర్ భార్య సునంద పుష్కర్ మృతి కేసులో మరో ట్విస్ట్. ఆమె మృతిపై మిస్టరీ ఇంకా వీడటం లేదు. ఆమె పోస్టుమార్టం రిపోర్టు అసంపూర్ణంగా ఉందని దర్యాప్తు వర్గాలు చెబుతున్నాయి. వైద్యులు సునంద రోజూ నిద్రమాత్రలు మింగేదని తెలిపారు గానీ, వాటి డోస్ ఎక్కువై ప్రాణాలు కోల్పోయిందని నిర్ధారించలేదని తెలిసింది.
ఆమె ఆల్కహాల్ కూడా తీసుకుని ఉండవచ్చని, దానికి తోడు, నిద్రమాత్రలు, ఖాళీ కడుపు కావడంతో రియాక్షన్ వచ్చి ప్రాణాలు కోల్పోయి ఉంటారని దర్యాప్తు అధికారులు సందేహిస్తున్నారు. వైద్యుల తుది నివేదిక కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో సునంద శవమై తేలిన విషయం తెలిసిందే.

రెండు నెలల క్రితం అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన సునందా పుష్కర్ శరీర కుహరంలోని అవయవాల నివేదిక డ్రగ్ ఓవర్ డోస్ జరిగినట్లు సూచిస్తున్నప్పటికీ ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయడానికి అది సరిపోదని పోలీసులు అంటున్నారు. కేంద్ర ఫోరెన్సిక్ లాబ్ నివేదిక దర్యాప్తులో పెద్దగా పురోగతికి అవసరమైన ఆధారాలను ఇవ్వలేదంట.
విష ప్రయోగం జరగలేదని, డ్రగ్ పాయిజనింగ్ మాత్రమే జరిగినట్లు ఆ నివేదిక పేర్కొంటోందని ఈ కేసు దర్యాప్తుతో సంబంధం ఉన్న పోలీసు ఉన్నతాధికారి చెప్పారు. సెంట్రల్ ఫోరెన్సిక్ లాబ్ పరీక్షల్లో ఎలాంటి విష ప్రయోగం జరిగింది, ఎంత మోతాదులో జరిగిందనేది నిర్ధారణ అవుతుందని భావించామని, అయితే ఆ నివేదిక అలా లేదని చెప్పారు.
ఫోరెన్సిక్ లాబ్ నివేదికపై మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి సునంద పుష్కర్ మృత దేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అఖిల నారత వైద్య శాస్త్రాల అధ్యయన సంస్థ(ఎయిమ్స్) డాక్టర్ల బృందం అభిప్రాయాలను తీసుకోవాలని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications