నా కోసం టైం వేస్ట్ చేసుకోవద్దు: సన్నీ లియోన్
ముంబై: రాజకీయ నాయకులు తన కోసం విలువైన సమయాన్ని వృథా చేసుకోవద్దని బాలీవుడ్ శృంగారతార సన్నీ లియోన్ అన్నారు. తాను చేసిన కండోమ్ ప్రకటనను సీపీఐ జాతీయ కార్యదర్శి అతుల్ కుమార్ అంజన్ తప్పుపట్టడంపై సన్నీ ఘాటుగా స్పందించారు.
కాగా, రాజకీయ నాయకులు తనపై విమర్శలు చేయడం చౌకబారుతనమని సన్నీ అభిప్రాయపడ్డారు. 'అధికారంలో ఉన్నవారు నా గురించి మాట్లాడుకోవడం మానుకుని కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయాలి. నాకోసం వారి సయమం వృథా చేయడం బాధాకరం' అని సన్నీ ట్వీట్ చేశారు.

అత్యాచారాలకు సన్నీ లియోన్ బాధ్యత వహించాల్సి ఉంటుందని, ఆమె చేసిన కండోమ్ యాడ్ గురించి వివాదాస్పదంగా మాట్లాడారు అతుల్. సన్నీ నటించిన ప్రకటన భావోద్వేగాలను రెచ్చగొట్టేలా ఉందని, ప్రజలు గనక ఆ ప్రకటన చూస్తే అత్యాచారాలు మరింత పెరగడం ఖాయమని అతుల్ కుమార్ అన్ జాన్ అన్న విషయం తెలిసిందే.
అయితే ఆ తర్వాత ఆయన క్షమాపణ చెప్పారు. కాగా, ఈ విషయంలో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి.. సన్నీలియోన్‌కు బాసటగా నిలిచారు. సన్నీ లియోన్ చేసిన కండోమ్ ప్రకటనపై విమర్శలు చేయడం సరికాదని అన్నారు.
Sad when people of of power waste their time and energy on me, instead of focusing on helping those in need !!!!! #SHAME #EPICFAIL
— Sunny Leone (@SunnyLeone) September 3, 2015 ఇది ఇలా ఉండగా, ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్మన్ కూడా సన్నీ లియోన్ నటించిన యాడ్‌ని తొలగించాలని కోరారు. అతుల్, మహిళా చైర్మన్ల వ్యాఖ్యల నేపథ్యంలోనే సన్నీ లియోన్ స్పందించినట్లు తెలుస్తోంది. తన గురించి కాకుండా ప్రజలకు సహాయం చేయడంలో శ్రద్ధ చూపిస్తే బాగుటుందని సన్నీ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications