వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2016లో రజనీకాంత్ 'కొత్త'గా వస్తున్నారా: బీజేపీతో...?

By Srinivas
|
Google Oneindia TeluguNews

చెన్నై: దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని ఆయన అభిమానులు, తమ తమ పార్టీలో చేరాలని ఇటీవలి బీజేపీ వరకు పలు పార్టీలు ఆశిస్తున్న విషయం తెలిసిందే. దశాబ్ద కాలంగా ఆయన రాజకీయ ఆరంగేట్రం పైన ప్రచారం సాగుతోంది. ఇటీవల బీజేపీ సూపర్ స్టార్‌ను తమ పార్టీలోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేసినట్లుగా వార్తలు వచ్చాయి.

తన రాజకీయ ఆరంగేట్రం పైన రజనీకాంత్ ఎప్పటికప్పుడు కొట్టి పారేసినప్పటికీ.. ఆయన రాజకీయాల్లో చేరుతున్నారని, ఆ పార్టీకి మద్దతిచ్చే అవకాశముందంటూ చాలాకాలంగా ప్రచారం సాగుతోంది.

superstar rajinikanth finally joining politics?

తాజాగా, మరోసారి ఆయన రాజకీయ ఆరంగేట్రం పైన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రజనీకాంత్ 2016 తమిళనాడు ఎన్నికల నాటికి రాజకీయాల్లోకి రావొచ్చుని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఆయన కొత్త పార్టీతో వస్తారట. తదుపరి ఎన్నికల నాటికి పార్టీ పెట్టి బీజేపీతో జత కలువవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం తమిళనాడులో డీఎంకే పార్టీ బలహీనం చెందడం, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకెను ధీటుగా ఎదుర్కొనే పార్టీ లేనందున 'కొత్త'గా వస్తారని అంటున్నారు. అయితే, రజనీకాంత్ పార్టీ పెడతారని, రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం కొత్తగా జరగడం లేదు. దీని పైన ఆయన పలుమార్లు వివరణ ఇచ్చారు. కానీ ఎప్పటికప్పుడు ఆయన పైన ఊహాగానాలు వస్తూనే ఉంటాయి.

English summary
We all know about Superstar Rajinikanth's (superstarrajini) huge fan following. For more than a decade, his fans want him to join politics but he has always evaded the topic. Now according to reports, there is a buzz of the actor joining politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X