సుప్రీంకోర్టు సంచలన తీర్పు- భోజ్ శాలలో శుక్రవారం నమాజ్ కు అనుమతి..!

మధ్యప్రదేశ్ లోని ధార్ జిల్లాలో ఉన్న వివాదాస్పద భోజ్ శాల-కమల్ మౌలా మసీదు ప్రాంగణంపై జరుగుతున్న విచారణ నేపథ్యంలో సుప్రీంకోర్టు (Supreme Court) ఇవాళ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. భోజ్ శాలా ప్రాంగణంలో ఉన్న కమలా మౌలా మసీదులో ముస్లింలు శుక్రవారం నమాజ్ చదువుకునేందుకు అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది. ఈ మేరకు అనుమతి ఇస్తూ ఇవాళ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే గతంలో మధ్యప్రదేశ్ హైకోర్టు ఈ ప్రాంగణాన్ని ఆలయంగా గుర్తిస్తూ ఇచ్చిన తీర్పు నిలిపివేతకు మాత్రం నిరాకరించింది.

మధ్యప్రదేశ్ లోని భోజ్‌శాల-కమల్ మౌలా మసీదు సముదాయాన్ని ఆలయంగా ప్రకటిస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు.. వివాదాస్పద స్థలం సమీపంలో శుక్రవారం ప్రార్థనలు చేసుకునేందుకు ముస్లింలకు మాత్రం అనుమతినిచ్చింది. సీజేఐ సూర్యకాంత్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ మేరకు మధ్యంతర చర్యగా ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 1 నుండి 3 గంటల మధ్య ఆ స్థలం సమీపంలో ప్రార్థనలు చేసుకునేందుకు ముస్లింలకు అనుమతి ఇస్తూ ఆదేశాలు వెలువరించింది.

supreme court allows Friday namaz at disputed bhojshala site but declined to pause temple order

ఇవి సున్నితమైన అంశాలని, ఉద్రిక్తతలకు దారితీసే లేదా శాంతిభద్రతల పరిస్థితిని ప్రభావితం చేసే ఎలాంటి ఉత్తర్వులను మనం జారీ చేయకూడదని సీజేఐ పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై తుది విచారణను మూడు వారాల తర్వాత చేపడతామని ధర్మాసనం తెలిపింది. అదే సమయంలో, కోర్టు ముందస్తు అనుమతి లేకుండా ఆ కట్టడంలో ఎలాంటి నిర్మాణపరమైన మార్పులు చేయకూడదని ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI)ని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే తాత్కాలిక చర్యగా, ఇరు పక్షాల హక్కులకు ఎటువంటి భంగం కలగకుండా ఆ స్థలానికి ఆనుకుని లేదా సమీపంలో ముస్లింలకు ప్రత్యేక స్థలాన్ని కేటాయించాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఏర్పాటు తుది తీర్పునకు లోబడి తాత్కాలికంగా మాత్రమే ఉంటుందని ధర్మాసనం తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+