కేంద్రానికి సుప్రీం వార్నింగ్ : ఎందుకా జాప్యం?
న్యూఢిల్లీ : న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం నాన్చుడు ధోరణిని తీవ్రంగా తప్పుబట్టింది సుప్రీం ధర్మాసనం. ఇప్పటికైనా న్యాయమూర్తుల నియామక ప్రక్రియను వేగవంతం చేయకపోతే.. ప్రధాని పీఎంవో కార్యాలయానికి సమన్లు జారీ చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది.

గత తొమ్మిది నెలల నుంచి కేవలం పేర్లు చెప్పడంతోనే కేంద్రం సరిపెట్టుకుందని.. ఇంకెంతకాలం ఈ సాగదీత ధోరణిని కొనసాగిస్తారని ప్రశ్నించింది. న్యాయమూర్తుల నియామకం విషయంలో కేంద్ర వైఖరిని తప్పుబడుతూ.. ఈ ప్రతిష్ఠంభనకు వెంటనే తెరదించాల్సిందిగా హితవు పలికింది.
కొలీజియం సిఫారసుల విషయంలో అభ్యంతరాలుంటే ఎందుకు వెనక్కి పంపించడం లేదని ప్రశ్నించింది సుప్రీం. సుప్రీం చీఫ్ జస్టిస్ ఠాకూర్ చేసిన ఈ వ్యాఖ్యలపై స్పందించిన అటార్నీ జనరల్ ముఖుల్ రోహత్గీ.. ఇది ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేస్తోన్న జాప్యం కాదని, ఎంపిక విధానానికి సంబంధించిన ప్రక్రియ ఒకేసారి ఖరారైతే.. న్యాయమూర్తుల నియామక ప్రక్రియ ఊపందుకుంటుందని వివరించారు.












Click it and Unblock the Notifications