వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రిపబ్లిక్ వేడుకలకు చీఫ్ గెస్టుగా సురినామే దేశాధ్యక్షుడు చంద్రిక -భారత సంతతి నేతగానూ పాపులర్

|
Google Oneindia TeluguNews

జనవరి 26న జరుగనున్న భారత గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా సురినామే దేశాధ్యక్షుడు చంద్రికపెర్సద్ సంటోఖి హాజరు కాబోతున్నారు. భారత్ ఆహ్వానాన్ని అంగీకరించి, ఢిల్లీకి వచ్చేసేందుకు చంద్రిక అంగీకరించారంటూ ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది.

కూతురి అక్రమ సంబంధంపై తండ్రి ఫైర్ -అత్తింట్లో ప్రియుడితో పట్టుబడ్డ యువతి -చివరికి భారీ ట్విస్ట్కూతురి అక్రమ సంబంధంపై తండ్రి ఫైర్ -అత్తింట్లో ప్రియుడితో పట్టుబడ్డ యువతి -చివరికి భారీ ట్విస్ట్

రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా అంతకుముందు బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్‌ను ఆహ్వానించడం తెలిసిందే. అయితే బ్రిటన్‌లో కోవిడ్ స్ట్రెయిన్ విజృంభిస్తుండటంతో జాన్సన్ పర్యటన రద్దయింది. దీంతో భారత ప్రభుత్వం సురినామే దేశాధ్యక్షుడిని ఆహ్వానించింది. జనవరి 26న జరిగే ఈ ఉత్సవాలకు హాజరయ్యేందుకు సంటోఖి అంగీకరించినట్లు పీఎంఓ వర్గాలు తెలిపాయి.

Coronavirus daily updates around the world and India, here are the updates in AP and Telangana too

దక్షిణ అమెరికా ఈశాన్య తీరంలోని సురినామే దేశానికి ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న చంద్రికపెర్సద్ సంటోఖి భారత సంతతి నేత కావడం గమనార్హం. ఇటీవల కేంద్రం నిర్వహించిన ప్రవాసీ భారతీయ దినోత్సవాల్లోనూ ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఈ కార్యక్రమంలో సంటోఖి కీలకోపన్యాసం ఇచ్చారు.

నిమ్మగడ్డ -జగన్ వార్: మధ్యలో మోదీ -ఎన్నికల వివాదంలోకి కేంద్రాన్ని లాగిన ఏపీ -రేపు ప్రధానితో సీఎం భేటీనిమ్మగడ్డ -జగన్ వార్: మధ్యలో మోదీ -ఎన్నికల వివాదంలోకి కేంద్రాన్ని లాగిన ఏపీ -రేపు ప్రధానితో సీఎం భేటీ

చంద్రికపెర్సద్ గతేడాది జూలైలో సురినామే దేశాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. 51 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ప్రొగ్రెసివ్ రిఫార్మ్ పార్టీకి 20 స్థానాలు లభించాయి. ఆయన విజయంతో డేసి బౌటెర్సే నియంత‌ృత్వ పాలనకు తెరపడింది. ఈ పార్టీ అత్యధికంగా ఇండియన్ కమ్యూనిటీకి ప్రాతినిధ్యం వహిస్తుంది. అందువల్ల దీనిని యునైటెడ్ హిందుస్థానీ పార్టీ అని కూడా పిలుస్తారు. సురినామే దేశ జనాభా 5,87,000 కాగా, ఈ జనాభాలో 27.4 శాతం మంది భారత సంతతి ప్రజలు ఉన్నారు. ఇది ఒకప్పటి డచ్ వలస రాజ్యం.

English summary
President of the Republic of Suriname, Chandrikapersad Santokhi, will be the chief guest at India's Republic Day parade on January 26, sources in the PMO told News18 on Sunday, days after UK Prime Minister Boris Johnson cancelled his visit to India. Sources confirmed that Santokhi, who is of Indian origin, will be attending the Rajpath parade.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X