బెంగళూరు బాంబు పేలుడు: అనుమానిత ఉగ్రవాదుల అరెస్టు?
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో నిత్యం రద్దిగా ఉండే ఎంజీ రోడ్డు సమీపంలోని చర్చిస్ట్రీట్లో జరిగిన బాంబు పేలుడు కేసు ఒక కొలిక్కి వచ్చింది. బాంబు పేలుడు జరిపిన వారిని పోలీసులు గుర్తించారు. గురువారం వారి అరెస్టును బెంగళూరులో అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.
2014 డిసెంబర్ 29వ తేది రాత్రి 8 గంటల సమయంలో చర్చి స్ట్రీట్ లోని కోకోనెట్ గ్రేవ్ రెస్టారెంట్ ముందు భాగంలో బాంబు పేలుడు జరిగింది. ఈ బాంబు పేలుడులో చైన్నయ్ కు చెందిన భవాని దేవి (35) అనే మహిళమరణిచింది. ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. కబ్బన్ పార్క్ పోలీసులు కేసు నమోదు చేశారు. కబ్బన్ పార్క్ ఏసీపీ శోభరాణి ఆధ్వర్యంలో నాలుగు ప్రత్యేక టీంలు ఎర్పాటు చేసి కేసు దర్యాప్తు చేశారు.

దర్యాప్తు చేస్తున్న పోలీసులు బీహార్, మహారాష్ట్ర,మధ్యప్రదేశ్, ఢిల్లీలో గాలించారు, చివరికి స్థానిక పోలీసుల సహకారంతో నిందితులు బోపాల్, పాట్న, ఢిల్లీ, ముంబాయిలో నిందితులు తలదాచుకున్నారని గుర్తించారు. స్థానిక పోలీసుల సహకారంతో బాంబు పేలుడు జరిపిన నిందితులను అరెస్టు చెయ్యడానికి వీలు కలిగిందని బెంగళూరు పోలీసు అధికారులు తెలిపారు.
విశ్వసనీయ వర్గాల ప్రకారం ఇప్పటికే ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులను పోలీసులు అదుపులోకి తీసుకుని బెంగళూరు బయలుదేరారని తెలిసింది. బెంగళూరు పోలీసుల అదుపులో ఉన్న ఉగ్రవాదులకు పాకిస్థాన్ కు చెందిన లష్కర్-ఏ-తోయిబా, హిజ్బల్ ముజాహుద్దిన్, భారతదేశ ప్రభుత్వం నిషేదించిన సిమితో సంబంధాలు ఉన్నాయని పోలీసు అధికారులు ఆదారాలు సేకరించారు.

గురువారం లేదా శుక్రవారం బెంగళూరు నగర పోలీసు కమిషనర్ ఎం.ఎన్. రెడ్డి అధికారికంగా ఉగ్రవాదులను అరెస్టు చేసినట్లు వెళ్లడిస్తారని పోలీసు వర్గాలు అంటున్నాయి.












Click it and Unblock the Notifications