షాక్:అన్నాడిఎంకె నుండి శశికళ కుటుంబం ఔట్, పన్నీర్ దే పైచేయి

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై:అన్నాడిఎంకె నుండి శశికళ కుటుంబం నుండి బహిష్కరిస్తూ పార్టీ నిర్ణయం తీసుకొంది. అన్నాడీఎంకె నుండి శశికళ కుటుంబం నుండి బహిష్కరిస్తున్నట్టు తీసుకొన్న నిర్ణయాన్ని 122 మంది ఎమ్మెల్యేలు సమర్థించారు.

sasikala

రెండు రోజులుగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం , ప్రస్తుత ముఖ్యమంత్రి పళని స్వామి వర్గాల మధ్య చర్చలు జరుగుతున్నాయి.ఈ పరిణామాల నేపథ్యంలో రెండు వర్గాలు రాజీకి వచ్చాయి.

అయితే ఈ చర్చలపై అన్నాడిఎంకె ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.అయితే పార్టీ నిర్ణయం మేరకు ఈ నిర్ణయం తప్పనిసరిగా మారిందని పార్టీ నాయకులు చెబుతున్నారు.

ఈ మేరకు మంగళవారం నాడు అత్యవసరంగా సమావేశమైన పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్లు ఈ మేరకు అన్నాడీఎంకె నుండి శశికళ కుటుంబాన్ని తొలగించాలని నిర్ణయం తీసుకొన్నట్టు మంత్రి జయకుమార్ వెల్లడించారు.

ఆర్ కె నగర్ ఉప ఎన్నికలు రద్దు చేయడంతో అన్నాడీఎంకెలోని ముఖ్యమంత్రి పళని స్వామి వర్గం తీవ్ర ఆగ్రహంగా ఉంది. దీనికితోడు పార్టీ ఎన్నికల గుర్తు కోసం ఎన్నికల కమిషన్ అధికారులకు లంచం ఇచ్చేందుకు దినకరన్ ప్రయత్నించారని ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు దినకరన్ ను త్వరలోనే అరెస్టు చేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.

మన్నార్ గుడి మాఫియాకు షాక్ కల్గించే నిర్ణయాన్ని అన్నాడిఎంకె తీసుకొంది.ఈ మేరకు పన్నీర్ సెల్వం వర్గంతో చేసిన చర్చల్లో భాగంగా పళని స్వామి వర్గం నాయకులు పార్టీ నుండి శశికళతో పాటు దినకరన్ తో పాటు మన్నార్ గుడి మాఫియాకు పార్టీ నుండి బయటకు పంపాలని నిర్ణయం తీసుకొంది.

శశికళతో పాటు దినకర్ సహ మన్నార్ గుడి మాఫియాకు పార్టీకి సంబంధం లేదని ప్రకటించింది అన్నాడీఎంకె.ఈ విషయాన్ని మంత్రి జయకుమార్ ప్రకటించారు. మరో వైపు పన్నీర్ సెల్వం డిమాండ్లపై బుదవారం నాడు చర్చించే అవకాశాలున్నాయి.

మరో వైపు శశికళ వర్గంపై పన్నీర్ సెల్వం వర్గం పై చేయి సాదించింది.అయితే అన్నాడిఎంకె ఎమ్మెల్యేలు శశికళకు విధేయులుగా ఉన్న ఎమ్మెల్యేలు ఏ రకంగా వ్యవహరిస్తారనేది ఆసక్తి నెలకొంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
It is 'Sasikala Natarajan camp' no more. Making their decision to oust Sasikala from the party, Tamil Nadu minister Jayakumar on Tuesday announced that they will move forward without Sasikala or her family. The move comes as a jolt to Sasikala and her family including TTV Dinakaran. In their efforts to merge the two warring factions of the AIADMK, Edappadi Palanisamy's camp decided to yield to O Panneerselvam's demand.
Please Wait while comments are loading...