పాత పగలు.. కొత్త పొత్తులు, తమిళనాట చిన్నమ్మ కొత్త వ్యూహం

తమిళనాడు రాజకీయ యవనికపై మరో భారీ కుదుపు చోటుచేసుకుంది. అన్నాడీఎంకే మాజీ అధినేత్రి వీకే శశికళ, పీఎంకే వ్యవస్థాపకుడు ఎస్. రామదాస్ చేతులు కలపడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రాబోయే తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ఈ ఇద్దరు సీనియర్ నాయకులు కొత్త రాజకీయ పొత్తును ప్రకటించారు. గత వారం తైలాపురం ఫామ్‌హౌస్‌లో జరిగిన రహస్య భేటీ అనంతరం ఈ 'డైనమిక్' కూటమి అధికారికంగా తెరపైకి వచ్చింది.

శశికళ ఇటీవల స్థాపించిన 'ఆల్ ఇండియా పురట్చి తలైవర్ మక్కల్ మున్నేట్ర కళగం' (AIPTMMK), రామదాస్ నేతృత్వంలోని పీఎంకే వర్గం కలిసి ఎన్నికల బరిలోకి దిగనున్నాయి. "తమిళనాడు ఆత్మగౌరవాన్ని కాపాడటం, ద్రోహం చిహ్నాలను తుడిచిపెట్టడమే మా లక్ష్యం" అని ఈ కూటమి సంయుక్త ప్రకటన విడుదల చేసింది. ముఖ్యంగా ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి (EPS) మరియు తన మేనల్లుడు టీటీవీ దినకరన్‌లను లక్ష్యంగా చేసుకుని శశికళ ఈ వ్యూహాన్ని రచించినట్లు స్పష్టమవుతోంది.

Tamil Nadu Assembly Election 2026 Sasikala and PMK Ramadoss Form Strategic Alliance to Challenge EPS and NDA

చీలుతున్న కుల ఓట్లు.. ఎన్డీఏకు సెగ!

దక్షిణ తమిళనాడులో పట్టున్న 'థేవార్' సామాజిక వర్గానికి శశికళ ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఉత్తరాన 'వన్నియార్' ఓట్లు రామదాస్ వెంటే ఉన్నాయి. అయితే, థేవార్ ఓట్లు ఇప్పుడు దినకరన్ (NDA), ఓ పన్నీర్‌సెల్వం (DMK కూటమి) మరియు శశికళ మధ్య చీలిపోయే అవకాశం ఉంది. మరోవైపు, రామదాస్ తన కుమారుడు అన్బుమణి రామదాస్‌తో విభేదాల కారణంగా వన్నియార్ ఓట్లు కూడా రెండుగా చీలుతున్నాయి. ఈ పరిణామం ముఖ్యంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి పెద్ద తలనొప్పిగా మారింది. థేవార్, వన్నియార్ ఓటర్లలో చీలిక వస్తే అది నేరుగా ఎన్డీఏ ఓటు బ్యాంకుపై ప్రభావం చూపుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

పాత పగలు.. కొత్త పొత్తులు

జయలలిత మరణానంతరం శశికళ చేతుల మీదుగా ముఖ్యమంత్రి అయిన పళనిస్వామి, ఆ తర్వాత ఆమెనే పార్టీ నుండి బహిష్కరించడం శశికళకు కోలుకోలేని దెబ్బ. అటు దినకరన్ కూడా బీజేపీతో చేతులు కలపడం ఆమెకు మింగుడుపడటం లేదు. అందుకే ఈ 'చిన్నమ్మ' ఇప్పుడు పాత పగను తీర్చుకునేందుకు రామదాస్‌తో జతకట్టారు. తమిళనాడులో ఏప్రిల్ 23న, పుదుచ్చేరిలో ఏప్రిల్ 9న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో ఈ కొత్త కూటమి ప్రభావం ఎంతవరకు ఉంటుందనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.

ఎన్నికల బరిలో కొత్త శకానికి నాంది!

రామదాస్ వర్గం ఇప్పుడు కొత్త గుర్తు లేదా జెండాతో బరిలోకి దిగుతుందా లేక పీఎంకే పేరునే కొనసాగిస్తుందా అనే అస్పష్టత ఇంకా కొనసాగుతోంది. ఏది ఏమైనా, శశికళ ఎంట్రీతో తమిళనాడు ఎన్నికల రణం త్రిముఖ పోటీగా మారడమే కాకుండా, అధికార, ప్రతిపక్ష కూటములకు వెమరుగా కొత్త సవాళ్లను విసురుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+