రాజకీయ సుడిగుండంలో తమిళనాడు సీఎం: కావేరీ నీటిలో కూల్ గా మహా పుష్కర స్నానం !
రాజకీయ సుడిగండంలో చిక్కకున్న సీఎం పళనిసామికూల్ గా కావేరీ నీటిలో మహా పుష్కర స్నానం చేసిన పళనిసామిమొక్కులు చెల్లించుకుని కష్టాల నుంచి తప్పించాలని స్వామి వారికి ప్రత్యేక పూజలు
చెన్నై: ప్రత్యర్థులు, సొంత పార్టీలోని రెబల్ ఎమ్మెల్యేలు ముప్పతిప్పలు పెడుతున్న సమయంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి ముందుగా నిర్ణయించుకున్నట్లే కూల్ గా మహా పుష్కర స్నానం చేసి దేవుడికి మొక్కులు చెల్లించుకున్నారు.
తమిళనాడులోని నాగపట్నం జిల్లాలోని మైలాడుతురై ప్రాంతంలోని శ్రీలక్ష్మిసమేత శ్రీ విశ్వనాథస్వామి దేవాలయంలో బుధవారం సీఎం ఎడప్పాడి పళనిసామి, ఆ రాష్ట్ర చేనేత పరిశ్రమల శాఖ మంత్రి ఓఎస్. మణియన్, ప్రభుత్వ చీఫ్ విప్ రాజేంద్రన్ తదితరులు మహా పుష్కర ఉత్సవాల్లో పాల్లొని పుష్కరణ స్నానం చేశారు.

అనంతరం దేవాలయంలో స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. తరువాత నేరుగా వెళ్లి కంచి శంకరాచార్య శ్రీ జయేంద్ర సరస్వతిని కలుసుకున్నారని సమాచారం. ఈ నెల 12వ తేది నుంచి ఈనెల 24వ తేది వరకు మహా పుష్కర స్నానాల ఉత్సవాలు జరుగుతున్నాయి.

పవిత్రమైప కావేరీ నది నీటిలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోయి అన్ని కష్టాలు తీరుతాయని తమిళనాడు ప్రజల నమ్మకం. గతవారం డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే. స్టాలిన్ సతీమణి దుర్గ స్టాలిన్ సైతం ఇక్కడి ఆలయంలో పుష్కర స్నానాలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.













Click it and Unblock the Notifications