చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రూ. లక్ష కోట్లు, లక్షన్నర ఉద్యోగాలు: జయలలిత

|
Google Oneindia TeluguNews

చెన్నై: ప్రపంచ పెట్టుబడి దారులను ఆకట్టుకోవడానికి తమిళనాడు ప్రభుత్వం శక్తి వంచనలేకుండ కృషి చేస్తున్నది. బుధవారం చెన్నైలో ప్రపంచ పెట్టుబడి దారుల సమ్మేళనాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి కుమారి జే.జయలలిత, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించారు.

 Tamil Nadu Global Investors Meet in Chennai

ఈ సందర్బంగా రూ. లక్ష కోట్ల పెట్టబడులు పెట్టాలని తమిళనాడు ప్రభుత్వం ఆహ్వానించింది. భారత్ తో పాటు రష్యా, కెనడా , జపాన్, సింగపూర్, ఫ్రాన్స్, ఇటలి, కొరియా, బ్రిటన్ తదితర దేశాలకు చెందిన ఐదు వేల మంది వాణిజ్యవేత్తలు ఈ సమ్మేళనంలో పాల్గోన్నారు.

రానున్న మూడేళ్లలో తమిళనాడులో లక్షన్నర ఉద్యోగాలు కల్పించడానికి శక్తి వంచనలేకుండ కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి కుమారి జయలలిత అన్నారు. ప్రపంచ పెట్టుబడి దారులకు అన్ని విధాల తమ ప్రభుత్వం సహకరిస్తుందని ఆమె హామి ఇచ్చారు.

 Tamil Nadu Global Investors Meet in Chennai

విదేశీ పెట్టుబడి దారులకు అన్ని సౌకర్యాలు కల్పించడానికి ఇక్కడి ప్రభుత్వం సిద్దంగా ఉందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఇదే సందర్బంలో పలువురు వాణిజ్యవేత్తలు తమిళనాడులో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు.

దక్షిణ తమిళనాడులో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి వాణిజ్యవేత్తలు ఆసక్తి చూపించారు. అందులో హెచ్ సీఎల్ కంపెనీ ముందు వరసలో నిలబడింది. రెండు రోజుల పాటు ప్రపంచ పెట్టుబడి దారుల సమ్మేళనం కొనసాగనుంది.

English summary
Tamil Nadu Chief Minister J Jayalalithaa made a strong pitch for investment this morning at a meet for global investors in Chennai where she claimed deals worth Rs. one lakh crore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X