ఆగని మరణాలు.. ఉత్తర్‌ప్రదేశ్‌‌లో మరో రైలు ప్రమాదం !!

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని మీర్జాపూర్‌ జిల్లాలోని చునార్‌ రైల్వే స్టేషన్‌ తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా పవిత్ర గంగా స్నానానికి వచ్చిన భక్తులు.. పట్టాలు దాటుతుండగా రైలు ఢీ కొని ఆరుగురు మృత్యువాత పడ్డారు. ఈ వరుస ఘటనలతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అసలు ఎం జరిగిందంటే.. ?

స్థానికుల సమాచారం ప్రకారం.. చోపాన్‌-ప్రయాగ్‌రాజ్‌ ఎక్స్‌ప్రెస్‌ నుంచి కొంత మంది ప్రయాణికులు చునార్‌ స్టేషన్‌లో ఫ్లాట్‌ఫామ్‌ వైపు కాకుండా పట్టాలపైకి నేరుగా దిగారు. దాంతో వారు ట్రాక్ దాటేందుకు ప్రయత్నిస్తుండగా.. హౌరా-కల్కా నేతాజీ ఎక్స్‌ప్రెస్‌ వేగంగా అక్కడికి చేరింది. అయితే డ్రైవర్ వారిని గమనించి అత్యవసర బ్రేక్‌ వేసినా కానీ రైలు ఆగకపోవడంతో.. ఆరు మంది ప్రయాణికులు రైలు కిందపడి ప్రాణాలు కోల్పోయారు.

tarin-accident-at-uttar-pradesh-chunar-railway-station-and-six-dead

ప్రమాదానికి గురైన ప్రయాణికులు అందరూ చోపాన్‌ ప్రాంతం నుంచి వారణాసికి గంగాస్నానానికి బయల్దేరిన భక్తులు అని అధికారులు వెల్లడించారు. వారణాసి వెళ్లే తరుణంలో ఫ్లాట్‌ఫామ్‌కి బదులుగా పట్టాల వైపు దిగడం ఈ ప్రమాదానికి దారితీసిందని స్పష్టం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే రైల్వే పోలీసులు, స్టేషన్‌ సిబ్బంది, స్థానిక అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని సమీపంలోని మీర్జాపూర్ జిల్లా ఆస్పత్రికి తరలించగా.. కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

ఈ దుర్ఘటనపై ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ.. సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. గాయపడిన వారికి తక్షణ వైద్య సహాయం అందించడంపై కూడా దృష్టి పెట్టాలని సూచించారు. అంతే కాకుండా ఈ ఘటనపై భారత రైల్వే మంత్రిత్వ శాఖ కూడా స్పందించింది. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించబడింది. అలాగే బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఆర్థిక సహాయం ప్రకటించే అవకాశం ఉందని రైల్వే వర్గాలు వెల్లడించాయి.

మరోవైపు ప్రాంతీయ ప్రజలు రైల్వే శాఖపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. చునార్‌ స్టేషన్‌లో ఫ్లాట్‌ఫామ్‌ కనెక్టింగ్‌ బ్రిడ్జ్‌ లేకపోవడం, తగిన హెచ్చరికలు లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. ప్రయాణికులు ట్రాక్ దాటకుండా ఉండేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా రైల్వే శాఖ చర్యలు తీసుకోవాలని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+