వారికి టీసీఎస్ బిగ్ షాక్.. ఆశలు గల్లంతే!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్1బి వీసా ఫీజు విషయంలో తీసుకున్న సంచలన నిర్ణయం ఇప్పుడు యూఎస్ లోని విదేశీ విద్యార్థులకు భారీ షాక్ ఇచ్చింది. డోనాల్డ్ ట్రంప్ నిర్ణయం దిగ్గజ టెక్ కంపెనీలకు ఆందోళన కలిగించింది. ఈ భారీ ఫీజుతో కంపెనీలపై అదనపు ఆర్థిక భారం పడనున్న నేపథ్యంలో టిసిఎస్ సీఈవో కే కృతివాసన్ షాకింగ్ కామెంట్స్ చేశారు.

h1b వీసా కింద ఉద్యోగాలు చేయాలనుకునే వారికి షాక్
ఈ సంవత్సరం అమెరికాలో h1b వీసా కింద ఉద్యోగాలు చేయాలనుకునే వారికి తమ కంపెనీలో అవకాశం ఇవ్వబోమని ఆయన తేల్చి చెప్పారు. అమెరికాలో తమకు సరిపడా హెచ్ వన్ బి ఉద్యోగులు ఉన్నారని, యూఎస్ టిసిఎస్ లో 32 వేల నుంచి 33 వేల మంది వరకు సిబ్బంది ఉన్నారని, అందులో దాదాపు 11 వేల మంది హెచ్1బీ వీసాల పైన వచ్చిన వారని ఆయన పేర్కొన్నారు.

TCS big shock regarding H1B new employees TCS ceo Said TCS won t hire h1b applicants

హెచ్1 బి వీసా కింద కొత్త ఉద్యోగులను నియమించుకునే ప్రణాళిక లేదన్న టీసీఎస్
ఈ సంవత్సరం ఇప్పటికే 500 మందిని భారత్ నుండి అమెరికాకు హెచ్1బి వీసాలపై పంపించినట్టు కృతి వాసన్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఏడాది హెచ్1 బి వీసా కింద కొత్త ఉద్యోగులను నియమించుకునే ప్రణాళిక ఏదీ లేదని ఆయన స్పష్టం చేశారు. ట్రంప్ కోరినట్టు స్థానిక అమెరికా ఉద్యోగుల నియామకాలకు ప్రయారిటీ ఇస్తామని పేర్కొన్నారు.

హెచ్ వన్ బి వీసా ఉద్యోగులను తగ్గించుకోవాలని భావిస్తున్న టీసీఎస్
అంతేకాదు హెచ్ వన్ బి వీసా ఉద్యోగులపై ఆధారపడటాన్ని క్రమంగా తగ్గించుకోవాలని తమ కంపెనీ భావిస్తోందని కృతి వాసన్ షాకింగ్ విషయం చెప్పారు. ఇవాళ టిసిఎస్ చేపట్టిన రెండు శాతం ఉద్యోగుల తొలగింపుపైన కూడా స్పందించిన ఆయన కంపెనీ భవిష్యత్తు దృష్ట్యా, తప్పనిసరి పరిస్థితులలో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా వెల్లడించారు. దీని కారణంగా ప్రభావితమైన ఉద్యోగులకు మెరుగైన తొలగింపు ప్యాకేజీని కూడా అందించామని టిసిఎస్ సీఈవో కృతి వాసన్ పేర్కొన్నారు.

విదేశీ విద్యార్థులకు చేదు వార్త
h1b ఉద్యోగులను నియమించుకునే కంపెనీలలో ఇప్పటివరకు అమెరికాలో అగ్రస్థానంలో ఉన్న టిసిఎస్ తాజా నిర్ణయం అక్కడి విదేశీ విద్యార్థులకు షాకింగ్ అని చెప్పాలి. 2024 25 ఆర్థిక సంవత్సరంలో కూడా 55 మంది హెచ్ వన్ బి ఉద్యోగులను నియమించుకున్న టిసిఎస్, ఈ సంవత్సరం నుండి హెచ్1 బి ఉద్యోగులను తీసుకోబోమని ప్రకటించడం అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేయాలని కలలు కంటున్న విదేశీ విద్యార్థులు అందరికీ చేదు వార్త.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+