తెలంగాణ బిడ్డలు ప్రపంచాన్ని శాసించేలా విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు

తెలంగాణ బిడ్డలు ప్రపంచాన్ని శాసించేలా విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.ప్రపంచంలోని అభివృద్ధి చెందిన తొలి పది దేశాలతో పోటీపడే స్థాయికి తెలంగాణ విద్యావ్యవస్థను తీర్చిదిద్దాలని సంకల్పించిందని చెప్పారు.మహాత్మా గాంధీ స్ఫూర్తి, మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆశయాలకు అనుగుణంగా దేశంలో మరెక్కడా లేని విధంగా రాష్ట్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని తెలిపారు.

దేశ తొలి విద్యాశాఖ మంత్రిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ విద్యారంగ అభివృద్ధికి బలమైన పునాదులు వేశారని, వయోజన విద్యతో పాటు శాస్త్రీయ పరిజ్ఞానానికి ప్రాధాన్యతనిస్తూ దేశ విద్యావ్యవస్థకు గొప్ప దిశానిర్దేశం చేశారని గుర్తుచేశారు. ఆయన జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నివాళులర్పించడంతో పాటు, ఆయన ఆశయాలను ఆచరణలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

Telangana Education Reforms Quality Schooling for Every Child with young india and telangana public schools

‎ రాష్ట్ర ప్రభుత్వం సామాజిక, ఆర్థిక, రాజకీయ, ఉపాధి అంశాలతో కూడిన సమగ్ర కులగణన సర్వే నిర్వహించిందని తెలిపారు. ఈ సర్వే విశ్లేషణలో సమాజంలోని వివిధ కుటుంబాలు, కులాలు, వర్గాల అభివృద్ధిలో విద్య కీలక పాత్ర పోషిస్తోందని స్పష్టమైందన్నారు. ఈరోజు హన్మకొండ జిల్లా కాజీపేటలో పర్యటించిన డిప్యూటీ సీఎం కాజీపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో రూ. 10 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ తో ప్రపంచ దేశాలతో పోటీ పడేలా తెలంగాణా విద్యా వ్యవస్థను మార్చామన్నారు .27 లక్షల మంది విద్యార్థులకు ఏకకాలంలో బ్రేక్‌ఫాస్ట్‌ అందించే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని, ఇది ప్రపంచంలోనే ప్రత్యేకమన్నారు. వెనుకబడిన తరగతుల సంక్షేమానికి, విద్యార్థుల ఉజ్జ్వల భవిష్యత్తుకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు.

తెలంగాణలో సగం మెడికల్‌ షాప్స్ లో నో ఫార్మసిస్ట్స్.. టీజీ సేఫ్‌ నోటీసులు జారీ!
తెలంగాణలో సగం మెడికల్‌ షాప్స్ లో నో ఫార్మసిస్ట్స్.. టీజీ సేఫ్‌ నోటీసులు జారీ!

పేద, బలహీన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యతో పాటు అత్యుత్తమ వసతులు కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. అధునాతన సౌకర్యాలతో నిర్మిస్తున్న ఈ భవనం అందుబాటులోకి వస్తే వందలాది మంది విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. మౌలిక వసతుల కల్పనలో రాజీ పడేది లేదని, నిర్దేశిత గడువులోగా భవన నిర్మాణ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+