Stand Up India Scheme: మీకూ వ్యాపారం చేయాలని ఉందా? స్టాండప్ ఇండియా కొత్త నిబంధనలు ఇవే!

స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ, స్వశక్తితో ఎదిగే పారిశ్రామికవేత్తలకు కొండంత అండగా నిలుస్తున్న 'స్టాండప్ ఇండియా' పథకానికి కేంద్ర ప్రభుత్వం సరికొత్త ఊపిరి ఊదింది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రారంభమైన ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని మరో ఐదేళ్ల పాటు, అంటే 2031 మార్చి 31 వరకు పొడిగించేందుకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసింది. ఈ పొడిగింపు ద్వారా రాబోయే ఐదేళ్లలో కొత్తగా మరో 2.5 లక్షల మందికి పైగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సాయం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.

రూ.4,111 కోట్ల గ్యారెంటీ నిధి.. పెరగనున్న అవకాశాలు

కేబినెట్ సమావేశం అనంతరం వివరాలను వెల్లడించిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్.. పథకం పురోగతిపై హర్షం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ , మహిళలు తమ సొంత వ్యాపారాలను ప్రారంభించడంలో ఈ పథకం అత్యంత విజయవంతమైందని, అందుకే దీనిని కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ పథకం కింద బ్యాంకుల నుంచి రుణాలు అందించేందుకు వీలుగా రూ.4,111 కోట్ల క్రెడిట్ గ్యారెంటీ కార్పస్‌ను కూడా కేబినెట్ ఆమోదించింది. బ్యాంకుల నుంచి నిధులు సులభంగా అందేలా, రుణం మొత్తంలో 85 శాతానికి ప్రభుత్వం గ్యారెంటీని ఇస్తుండటం విశేషం.

Stand Up India Scheme Extended Till 2031 With 4111 Crore Guarantee Corpus for Women SC ST Entrepreneurs
ముద్రా పథకానికి కొత్త ఊపిరి! రూ.62,370 కోట్ల ఎరువుల సబ్సిడీకి క్యాబినెట్ ఓకే!
ముద్రా పథకానికి కొత్త ఊపిరి! రూ.62,370 కోట్ల ఎరువుల సబ్సిడీకి క్యాబినెట్ ఓకే!

రూ.10 లక్షల నుంచి రూ. కోటి వరకు రుణాలు

ఉత్పాదక రంగం, సేవా రంగం, ట్రేడింగ్ , వ్యవసాయ ఆధారిత కార్యకలాపాల్లో కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకునే అర్హులైన వారికి రూ. 10 లక్షల నుంచి గరిష్టంగా రూ. 1 కోటి వరకు రుణాలు మంజూరు చేస్తారు. ప్రాజెక్టు వ్యయంలో 85 శాతం వరకు టర్మ్ లోన్ లేదా వర్కింగ్ క్యాపిటల్ రూపంలో బ్యాంకులు మంజూరు చేస్తాయి. అంతేకాకుండా, గ్యారెంటీ రుసుమును ఎటువంటి అదనపు రిస్క్ ప్రీమియం లేకుండా కేవలం 0.5 శాతంగా ప్రామాణీకరించారు. ప్రతీ బ్యాంకు శాఖ నుంచి సగటున కనీసం ఇద్దరికి (ఒక మహిళకు, ఒక ఎస్సీ/ఎస్టీకి) రుణం అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో రిలయన్స్ డేటా సెంటర్ కు ఆమోదం.. ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలివే!
భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో రిలయన్స్ డేటా సెంటర్ కు ఆమోదం.. ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలివే!

లక్షలాది మందికి స్వయం ఉపాధి రక్షణ

2016 ఏప్రిల్‌లో ప్రారంభమైన స్టాండప్ ఇండియా పథకం ద్వారా ఇప్పటివరకు దాదాపు 2.75 లక్షల మందికి పైగా ఎస్సీ, ఎస్టీ , మహిళా పారిశ్రామికవేత్తలకు నిధులు అందించి వ్యాపార యజమానులుగా తీర్చిదిద్దారు. కేవలం రుణాలను అందించడమే కాకుండా, వ్యాపార ప్రక్రియలో ఎదురయ్యే సందేహాలను నివృత్తి చేస్తూ ప్రభుత్వం తగిన మార్గదర్శకత్వం కూడా వహిస్తోంది. రాబోయే ఐదేళ్ల పొడిగింపుతో దేశంలో కొత్త పరిశ్రమలు నెలకొల్పబడి, లక్షలాది మంది నిరుద్యోగులకు కొత్తగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం విశ్వసిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+