భార్య ప్రియాంకాతో గంగూలి ఫుల్ హ్యాపీ, రాత్రి ఏం జరిగిందో తెలీదు, ఐటీ హబ్ తమ్ముడికి డౌట్ వచ్చి ?
దంపతులు సంతోషంగా కాపురం చెయ్యడంతో ఓ కొడుకు పుట్టాడు. ఆ టెక్కీ అతని భార్య, 8 ఏళ్ల కుమారుడిని హత్య చేశాడు. భార్య, కొడుకును హత్య చేసిన టెక్కీ ఉరి వేసుకున్నాడు.
పూణే/ముంబాయి/బెంగళూరు: ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్న యువకుడు మంచి జీతం సంపాధించాడు. అందమైన యువతితో ఆ టెక్కీ పెళ్లి జరిగింది. దంపతులు సంతోషంగా కాపురం చెయ్యడంతో ఓ కొడుకు పుట్టాడు. ఆ టెక్కీ అతని భార్య, 8 ఏళ్ల కుమారుడిని హత్య చేశాడు. భార్య, కొడుకును హత్య చేసిన టెక్కీ ఉరి వేసుకున్నాడు. ఒకే ఫ్యామిలీలో ముగ్గురి ప్రాణాలు పోవడంతో ఆ ఇంట్లో విషాదచాయలు నెలకొన్నాయి.

టెక్కీ ఫ్యామిలీ హ్యాపీ
మహారాష్ట్రలోని పూణేలో సుదీప్తో గంగూలి అలియాస్ గంగూలి (44) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్న గంగూలి మంచి జీతం సంపాధించాడు. 10 సంవత్సరాల క్రితం అందమైన ప్రియాంకా అనే యువతితో టెక్కీ గంగూలీ పెళ్లి జరిగింది. గంగూలీ, ప్రియాంకా దంపతులు సంతోషంగా కాపురం చెయ్యడంతో తనిష్కా (8) అనే కుమారుడు ఉన్నాడు.

బెంగళూరులో సోదరుడికి డౌట్ వచ్చింది
గంగూలి సోదరుడు బెంగళూరులో టెక్కీగా ఉద్యోగం చేస్తున్నాడు. పూణేలో ఉన్న గంగూలి ప్రతిరోజు బెంగళూరులో ఉన్న సోదరుడికి ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు. గంగూలితో పాటు అతని భార్య ప్రియాంక, కుమారుడు తనిష్కా కూడా బెంగళూరులో ఉన్న టెక్కీతో మాట్లాడుతున్నారు. అయితే రెండు మూడు రోజుల నుంచి పూణేలో ఉన్న సోదరుడు గంగూలితో పాటు అతని కుటుంబ సభ్యులు ఫోన్ చేసి మాట్లాడకపోవడం, ఫోన్ చేసినా ఎవ్వరూ రిసీవ్ చెయ్యకపోవడంతో బెంగళూరులో ఉన్న యువకుడికి అనుమానం వచ్చింది.

ఇంటిలోపల లాక్ చేసి ?
బెంగళూరులో ఉన్న యువకుడిని అనుమానం వచ్చి పూణేలో ఉన్న స్నేహితుడికి ఫోన్ చేసి వెంటనే తన సోదరుడు గంగూలి ఇంటికి వెళ్లి చూడాలని చెప్పారు. స్నేహితుడు గంగూలి ఇంటికి వెళ్లి చూడగా లోపల లాక్ చేసి ఉంది. గంగూలితో పాటు అతని భార్య ప్రియాంకా. కుమారుడు కూడా కనిపించకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఫ్యామిలీ మొత్తం ఔట్
పోలీసులు డూప్లికేట్ కీని ఉపయోగించి గంగూలి ఇంటి తలుపు తెరిచి చూసి షాక్ అయ్యారు. గంగూలి ఉరి వేసుకుని కనిపించగా, అతని భార్య ప్రియాంకా, వారి కుమారుడు తనిష్క్ మృతదేహాలకు పాలిథిన్ బ్యాగుల్లో చుట్టి కనిపించడంతో అందరూ హడలిపోయారు. అయితే ఘటనా స్థలంలో ఎలాంటి డెత్ నోట్ దొరకలేదని పోలీసులు అన్నారు.

వ్యాపారం చేస్తున్న టెక్కీ
గంగూలి ఇటీవలే సాఫ్ట్‌వేర్ ఉద్యోగానికి స్వస్తి చెప్పి సొంతంగా వ్యాపారం ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. అయితే భార్య ప్రియాంకా, కొడుకును హత్య చేసిన గంగూలి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అని కచ్చితంగా తెలియడం లేదని, కేసులో విచారణ కొనసాగుతోందని పూణే పోలీసులు తెలిపారు. మొత్తం మీద టెక్కీ ఫ్యామిలీ మొత్తం ఒకేసారి శవాలై కనిపించడం కలకలం రేపింది.












Click it and Unblock the Notifications