చెన్నైకి వెళ్తుండగా.. రాష్ట్రపతి విమానంలో సాంకేతిక సమస్య.. మధ్యలోనే ఢిల్లీకి
విమానంలో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగానే ఆయన చెన్నై ప్రయాణం రద్దయినట్టుగా తెలుస్తోంది.
త్చెయున్నై: తమిళనాడు సీఎం జయలలిత అంత్యక్రియలకు హాజరయ్యేందకు జయలుదేరిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో మధ్యలోనే ఆయన ఢిల్లీకి వెనుతిరిగారు. విమానంలో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగానే ఆయన మధ్యలోనే ఢిల్లీ వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

అంతకుముందు మంగళవారం నాడు జయ ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన రాష్ట్రపతి ప్రణబ్.. ఆమె రాజకీయ జీవితాన్ని కొనియాడారు. ఈ సందర్బంగా ఆమెను ఓ ఫైటర్ గా అభివర్ణించారు. 1980లలో తాను లీడర్ ఆఫ్ హౌజ్ గా ఉన్నప్పటి రోజులను గుర్తుచేసుకుంటూ.. అప్పుడే రాజకీయ రంగప్రవేశం చేసిన జయలలిత ప్రస్థానం గురించి ప్రస్తావించారు.
'చాలా సందర్బాల్లో నేను జయలలితతో మాట్లాడాను. అభివృద్ది, పాలనా పరమైన అంశాలకు సంబంధించి చర్చించాను. వాస్తవాలపై, సిద్దాంతాలపై తనకు మంచి పాండిత్యం ఉండేది.' అంటూ జయతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు ప్రణబ్. జీవితంలో ఎన్ని యుద్దాల్ని జయించినా.. అంతిమంగా ఎవరైనా మరణం ముందు తలవంచడం తప్పదని ఆవేదన వ్యక్తం చేశారు. తన తుదిశ్వాస వరకు ఆమె మృత్యువుతో పోరాడారని కొనియాడారు.












Click it and Unblock the Notifications