మహిళలకు ఏటా రూ.30 వేలు..!!

బీహార్‌లో ప్రస్తుతం ఎన్నికల వాతావరణం ఉత్కంఠభరితంగా మారింది. రాష్ట్రంలో ప్రధాన పోటీ ఎన్డీయే (NDA) కూటమి, మహాగఠ్‌బంధన్ (RJD + Congress + Left) మధ్య నెలకొంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ, బీజేపీతో కలసి పోటీకి సిద్ధమవుతుండగా.. మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ ఆర్జేడీ తరఫున ఓటర్లకు చేరువ కావడానికి ప్రయత్నిస్తున్నారు. పోలింగ్ దగ్గర పడుతున్న తరుణంలో అధికార, ప్రతిపక్షాలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి.

ఈ క్రమంలోనే మొదటి దశ ఎన్నికల ప్రచారం చివరి రోజున తేజస్వి యాదవ్ సంచలన ప్రకటన చేశారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీహార్‌లోని ప్రతి మహిళకు సంక్రాంతి సందర్భంగా రూ.30,000 జమ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ పథకాన్ని 'మాయ్-బహిన్ మాన్ యోజనా' పేరుతో ప్రవేశపెట్టనున్నట్టు అనౌన్స్ చేశారు. ఇది కేవలం హామీ కాదని.. తమ కృతనిశ్చయత అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం మహిళలు ఆర్థికంగా బలపడేందుకు దోహదపడుతుందని తెలిపారు. దీంతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

tejaswi-yadav-comments-about-30-thousand-to-bihar-women-at-election-campaign

కాగా తేజస్వి యాదవ్ ప్రచార యాత్రలో మహిళా సాధికారతను ప్రధాన అంశంగా ఎంచుకున్నారు. ప్రతి సభలో మా తల్లులు, అక్కలు, చెల్లెళ్ల జీవితాల్లో సంతోషం తీసుకురావడం మా లక్ష్యం అని చెబుతూ ప్రచారం చేస్తున్నారు. ఆర్జేడీ మేనిఫెస్టోలో కూడా మహిళా ఉద్యోగావకాశాలు, విద్యారుణాలు, భద్రతా చర్యలు ప్రధాన ప్రాధాన్యత పొందాయి. ఇక తేజస్వి యాదవ్ తల్లి, ఆర్జేడీ ముఖ్య నాయకురాలు రబ్రీ దేవి కూడా ఈ ప్రచారంలో చురుకుగా పాల్గొంటున్నారు.

బీహార్‌లో మహిళా ఓటర్ల శాతం 48% కంటే ఎక్కువగా ఉంది. 2020 ఎన్నికల్లో మహిళా ఓటింగ్ రేటు పురుషులను మించిందని గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పుడు ఈ నిర్ణయంతో మహిళా ఓటర్లపై భారీ ప్రభావం చూపే అవకాశం ఉంది. మరోవైపు తేజస్వి యాదవ్ హామీలపై నితీష్ కుమార్, బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. బీహార్ ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకోకుండా ఇలాంటి భారీ హామీలు ఇవ్వడం ప్రజలను మభ్యపెట్టడమే" అని నితీష్ వ్యాఖ్యానించారు.

రెండు విడతల్లో పోలింగ్..

బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 స్థానాలు ఉన్నాయి. ఎన్నికల కమిషన్ ప్రకారం, నవంబర్ 6 మరియు నవంబర్ 11 తేదీల్లో రెండు విడతల్లో పోలింగ్ జరగనుంది. దేశవ్యాప్తంగా మరో 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు కూడా నవంబర్ 11న జరుగుతాయి. ఫలితాల ప్రకటన నవంబర్ 14న జరగనుంది. ఇప్పటికే బీహార్ ఎన్నికల కమిషన్ రాష్ట్రవ్యాప్తంగా భద్రతా ఏర్పాట్లను పటిష్టం చేసింది. దాదాపు 12 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

ఈ ఎన్నికల్లో రెండు కూటములు బలమైన ప్రచారం చేస్తుండగా.. చిన్నపార్టీలు కూడా కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని అంటున్నారు. ముఖ్యంగా పాస్వాన్ కుటుంబానికి చెందిన లొజపా (LJP-Ram Vilas faction) చిరాగ్ పాస్వాన్ ప్రభావం 10-15 సీట్లలో నిర్ణయాత్మకంగా ఉండవచ్చని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+