లోకసభలో తెలంగాణ బిల్లు: లగడపాటి పెప్పర్ స్ప్రే, రన్
న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లును (తెలంగాణ ముసాయిదా బిల్లు) లోకసభలో ప్రవేశ పెట్టారు. ఈ సమయంలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. విజయవాడ పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్ మిరాయాల పొడిని చల్లారు. దీంతో సభ్యులు ఒక్కసారిగా పరుగులు పెట్టారు.
సభలో గందరగోళం ఏర్పడటంతో బిల్లు ప్రవేశ పెట్టిన వెంటనే సభాపతి మీరా కుమార్ లోకసభను వాయిదా వేశారు. సభలో సీమాంధ్ర ప్రాంత కేంద్రమంత్రులు, ఎంపీలు పెద్ద ఎత్తున జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు. బల్లల పైకి ఎక్కి మైకులు విరగ్గొట్టారు. పత్రాలు కింద పడేశారు. ఆ వెంటనే సభ వాయిదా పడింది.

సభలో ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు ప్రవేశ పెడుతున్న సమయంలో లగడపాటి ఒక్కసారిగా మిరియాల పొడి స్ప్రే చేయడంతో అందరి కళ్లలో నుండి నీళ్లు, దగ్గు వచ్చాయి. దీంతో సభ్యులకు ఏమీ అర్థం కాలేదు. భయంతో పరుగులు పెట్టారు. తెలంగాణ సభ్యులు లగడపాటిని పక్కకు లాగేశారు. మార్షల్స్ సభ్యులను అక్కడి నుండి తరలించారు.
మరోవైపు రాజ్యసభలోను తెలంగాణ అంశం వేడి రాజేసింది. సభ్యులు చైర్మన్ మైక్రో ఫోన్స్‌ను విరిచివేసే ప్రయత్నం చేశారు. ఎంపీలు సమైక్యాంధ్ర ప్లకార్డులు పట్టుకున్నారు.












Click it and Unblock the Notifications