టిపై చర్చ: మైక్ లాగిన ఎంపి, ప్రత్యక్ష ప్రసారాల నిలిపివేత

 Security beefed up in and around parliament
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ ముసాయిదా బిల్లు) నేపథ్యంలో ఢిల్లీలో రాజకీయాలు వేడెక్కాయి. మంగళవారం లోకసభలో తెలంగాణ బిల్లుపై చర్చకు వచ్చే అవకాశముంది. కాగా, కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే బిల్లును లోకసభలో ప్రవేశ పెట్టి చర్చ చేపట్టాలని కోరారు. సీమాంధ్ర ఎంపీలు, కేంద్రమంత్రులు వెల్లోకి వచ్చి ఆందోళన తెలపడంతో స్పీకర్ మీరా కుమార్ సభను గం.12.45 వరకు వాయిదా వేశారు.

- తెలంగాణ బిల్లుపై చర్చ 2.30 గంటలకు ప్రారంభమయ్యే అవకాశముంది.

- పదకొండు గంటలకు ఉభయ సభలు ప్రారంభమైన కాసేపటికే వాయిదా పడ్డాయి. లోకసభలో, రాజ్యసభలో సీమాంధ్ర ఎంపీలు, కేంద్రమంత్రులు వెల్లోకి వచ్చి నిరసన తెలిపారు.

- సీమాంధ్ర ఎంపీలు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, లగడపాటి రాజగోపాల్‌లు మినహా సీమాంధ్ర ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. బిజెపి సహా పలు పార్టీలు సస్పెన్షన్ ఎత్తివేతకు డిమాండ్ చేశాయి.

- పన్నెండు గంటలకు ప్రారంభమైన రాజ్యసభలో పరిస్థితి మారలేదు. దీంతో రెండు గంటలకు వాయిదా పడింది.

- పన్నెండు గంటలకు లోకసభ ప్రారంభం కాగానే సీమాంధ్ర ఎంపీలు, కేంద్రమంత్రులు నిరసన తెలిపారు. ఎంపీలు వెల్లోకి వచ్చారు. ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. స్పీకర్ పదే పదే సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తమిళ జాలర్లకు న్యాయం చేయాలని తమిళ ఎంపీలు నిరసన తెలిపారు.

- నిరసనల మధ్యే కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే తెలంగాణ ముసాయిదా బిల్లు పైన చర్చను ప్రారంభించాలని కోరారు. గందరగోళం ఏర్పడింది. దీంతో స్పీకర్ సభను 12.45 నిమిషాలకు వాయిదా పడింది.

- తెలంగాణ బిల్లుకు మద్దతిస్తామని బిజెపి అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ ప్రకటించారు. కేంద్రమంత్రి జైరామ్ రమేష్‌తో భేటీ బిజెపి అగ్రనేతలు భేటీ అయ్యారు. ఎనిమిది కీలక సవరణలు చేశారు.

- మధ్యాహ్నం లేదా సాయంత్రం జివోఎం సభ్యులు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌తో భేటీ కానున్నారు.

- సీమాంధ్ర జిల్లాలు, హైదరాబాదు, సైబరాబాదు ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించాలని ఆదేశాలు వచ్చాయి.

- మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఉభయ సభలు వాయిదా పడిన అనంతరం అద్వానీతో జైరామ్ రమేష్ భేటీ అయ్యారు. మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదించవద్దని అద్వానీ సూచించారు.

- గం.12.45 నిమిషాలకు ప్రారంభమైన లోకసభ వాయిదా పడింది. సీమాంధ్ర ఎంపీలు, మంత్రులు నిరసన వ్యక్తం చేయడంతో సభలో గందరగోళం ఏర్పడింది. దీంతో సభను మూడు గంటల వరకు వాయిదా వేశారు.

- సభలో బిల్లును తాము వ్యతిరేకిస్తామని సమాజ్‌వాది పార్టీ సీనియర్ నేత రామ్ గోపాల్ యాదవ్ తెలిపారు. రాష్ట్రాల విభజనతో సమస్యలు వస్తాయన్న తమ పార్టీ నిర్ణయానికి కట్టుబడే ఉన్నామని చెప్పారు. అందుకు అనుగుణంగా బిల్లును తాము వ్యతిరేకిస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ విభజనకు తాము వ్యతిరేకమన్నారు.

సీమాంధ్ర ఎంపీలకు తోడు మంగళవారం మార్క్సిస్టు పార్టీ, శివసేన, అకాలీదళ్, సమాజ్‌వాది పార్టీ సభ్యులు కూడా బిల్లును వ్యతిరేకించారు. లోకసభ స్పీకర్ మీరా కుమార్ ముందుగా ప్రకటించినట్టు సభ మళ్లీ మంగళవారం మధ్యాహ్నం 12.45 నిమిషాలకు పునఃప్రారంభమైంది. అయితే సీమాంధ్ర సభ్యులకు తోడు మార్క్సిస్టు పార్టీకి చెందిన సభ్యులు కూడా తొలిసారిగా తెలంగాణ బిల్లుకు సభలో నిరసన వ్యక్తం చేశారు. వారు కూడా ప్లకార్డులు పట్టుకున్నారు. మార్క్సిస్టు పార్టీ సభ్యులు ఎన్నడూ లేనిది సేవ్ ఆంధ్రప్రదేశ్ అనే నినాదాలతో సభ వెల్‌లోకి వస్తూ నినాదాలు చేశారు.

- ప్రతిపక్షాలవైపు నుంచి ఎవ్వరూ సభ వెల్‌లోకి రాకుండా తెలంగాణ ఎంపిలు మందా జగన్నాథం, పొన్నం ప్రభాకర్ అడ్డుగా నిల్చుండగా, మార్క్సిస్టు పార్టీకి చెందిన సభ్యులు వారిని తోసుకుని ప్లకార్డులతో ముందుకు వచ్చి వెల్‌లోకి వెళ్లి నినాదాలు చేశారు. సిపిఎంతో పాటు అన్నాడిఎం డిఎంకె, డిఎంకె పార్టీలకు చెందిన సభ్యులు కూడా వెల్‌లోకి వచ్చారు. అయితే సిపిఎం సభ్యులు అందరూ సేవ్ ఆంధ్రప్రదేశ్ అని నినాదాలు చేయగా, డిఎంకె, అన్నా డిఎంకె పార్టీల సభ్యులు మత్స్యకారుల సమస్యలపై నినాదారు చేశారు.

- ఏవిధంగానైనా తెలంగాణ బిల్లును పాస్ చేయించాలని ధృఢనిశ్చయంతో ఉన్నామని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి ఆర్‌పిఎన్ సింగ్ స్పష్టం చేశారు. గందరగోళం మధ్య బిల్లు పాస్ చేయాలా వద్దా అనేది స్పీకర్ నిర్ణయిస్తారని ఆయన అన్నారు.

- మూడు గంటలకు ప్రారంభమైన లోకసభ మరోసారి వాయిదా పడింది. సభ ప్రారంభం కాగానే సీమాంధ్ర ఎంపీలు, మంత్రులు వెల్లోకి వెళ్లారు. ఓ ఎంపీ మైక్ లాగారు. సభలో గందరగోళం ఏర్పడటంతో మీరా కుమార్ సభను వాయిదా వేశారు. మరోవైపు తమిళనాడు ఎంపీలు కూడా ఆందోళన వ్యక్తం చేశారు.

- తెలంగాణ ముసాయిదా బిల్లు పైన లోకసభలో చర్చ కొనసాగుతోంది. అయితే స్పీకర్ ఆదేశాల మేరకు ప్రత్యక్ష ప్రసారాలను నిలిపివేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+