దక్షిణాది మాదే!: షాపై టీ బీజేపీ, విజయకాంత్ గ్రీటింగ్స్
హైదరాబాద్/చెన్నై: దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాల్లోను భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని తెలంగాణ బీజేపీ నేతలు బుధవారం ఆశాభావం వ్యక్తం చేశారు. అమిత్ షా పార్టీ అధ్యక్షుడు కావడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. అమిత్ షా సమర్థుడైన నాయకుడన్నారు. షా సారధ్యంలో బీజేపీ దేశంలో మరింత బలంగా బలపడుతుందన్నారు. ఈ సందర్భంగా మిఠాయిలు పంచుకుని, బాణసంచా కాల్చి హర్షం వ్యక్తం చేశారు.
విజయకాంత్ అభినందనలు
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన అమిత్ షాకు ప్రముఖ నటుడు, డీఎండీకే అధ్యక్షులు విజయకాంత్ అభినందనలు తెలిపారు. ప్రస్తుతం విజయకాంత్ ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

న్యాయం చేయండి: టీఎస్సార్
రైల్వే అనుబంధ (సప్లిమెంటరీ బడ్జెట్) లోనైనా తమకు న్యాయం చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ సుబ్బిరామి రెడ్డి పేర్కొన్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. 18 ఏళ్లు ఎంపీగా ఉన్న తాను ఇలాంటి బడ్జెట్ చూడలేదన్నారు.
రైల్వే బడ్జెట్ నిస్సారంగా, నిరాశాజనకంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 29 రైల్వే ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. విశాఖ రైల్వే జోన్ డిమాండ్‌ను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం అనుబంధ బడ్జెట్‌లోనైనా ఆంధ్రప్రదేశ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.












Click it and Unblock the Notifications