కర్ణాటకకు షాక్ ఇచ్చిన తెలంగాణ సీఎం కేసీఆర్ ?, మా వల్లకాదు సార్ !
బెంగళూరు/హైదరాబాద్: ఐదు ఉచిత హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చింది. ఇంతకాలం కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీకి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఐదు ఉచిత హామీల దెబ్బ పడింది. అయితే సీఎం కుర్చీలో కుర్చున్న సిద్దరామయ్యకు ఊహించని ఎదురుదెబ్బ పడింది. అన్న భాగ్య పథకం కింద రేషన్ కార్డులు ఉన్న వారికి 10 కేజీల బియ్యం ఉచితంగా ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు బియ్యం చిక్కడం లేదని వెలుగు చూసింది.
ఉచిత బియ్యం పంపిణి పథకం కింద కర్ణాటక ప్రజలకు 10 కేజీల బియ్యం ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తున్నది. ఉచిత బియ్యం ఇవ్వడానికి బియ్యం కొనుగోలు చెయ్యడానికి సీఎం సిద్దరామయ్య తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రధించింది. అయితే కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.

కర్ణాటక అడిగిన బియ్యం సరఫరా చెయ్యడానికి మా దగ్గర తగినంత బియ్యం స్టాక్ లేదని తెలంగాణ ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వానికి చెప్పిందని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది. తెలంగాణ నుంచి సీఎం సిద్దరామయ్య ప్రభుత్వం బియ్యం కొనుగోలు చెయ్యడానికి ప్రయత్నిస్తున్నదని, కన్నడిగుల కడుపు కొట్టడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్నదని శుక్రవారం మాజీ సీఎం కుమారుడు, బీజేపీ ఎమ్మెల్యే బీఎస్. విజయేంద్ర ఆరోపించిన విషయం తెలిసిందే.
ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కర్ణాటకకు బియ్యం సరఫరా చెయ్యడానికి సాధ్యం కాదని చెప్పిందని జాతీయ మీడియా అంటోంది. ఈ వియంపై కర్ణాటక సీఎం సిద్దరామయ్య మాట్లాడారు. అన్యభాగ్య పథకం కింద పేద ప్రజలకు ఉచితంగా బియ్యం పంపిణి చెయ్యడానికి తెలంగాణ నుంచి బియ్యం కొనుగోలు చెయ్యాలని ప్రయత్నించామని, తెలంగాణ సీఎం కేసీఆర్ ను బియ్యం కావాలని అడిగితే మా దగ్గర అంత స్టాక్ లేదని చెప్పారని సీఎం సిద్దరామయ్య అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల ప్రకారం కర్ణాటకలో రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఇంటికి 10 కేజీల ఉచిత బియ్యం పంపిణి చెయ్యాలంటే 4.45 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆహార భద్రతా పథకం కింద 5 కేజీల ఉచిత బియ్యం పంపిణి చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 5 కేజీల ఉచిత బియ్యానకి తోడుగా సిద్దరామయ్య ప్రభుత్వం మరో ఐదు కేజీల ఉచిత బియ్యం ఇవ్వాల్సి ఉంది.

అంటే కర్ణాటక ప్రభుత్వానికి ఇప్పుడు 2.17 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం అయ్యింది. తెలంగాణ బియ్యం ఇవ్వడానికి వీలు కాదని చెప్పడంతో సిద్దరామయ్య కేంద్ర ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఉచిత బియ్యం పంపిణ పథకాన్ని కర్ణాటకలో నిలిపివేస్తుందని సీఎం సిద్దరామయ్య ఆరోపించారు. మొత్తం మీద కర్ణాటకలో ప్రతి ఇంటికి 10 కేజీల ఉచిత బియ్యం ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పుడు బియ్యం చిక్కకపోవడంతో నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నదని వెలుగు చూసింది.












Click it and Unblock the Notifications